TRS Vs BJP | వడ్లకు, గోధుమలకు తేడా తెలియదా..? బీజేపీపై టీఆర్ఎస్ ట్రోల్స్-trs leaders trolling on telangana bjp leaders over paddy procurement ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Trs Vs Bjp | వడ్లకు, గోధుమలకు తేడా తెలియదా..? బీజేపీపై టీఆర్ఎస్ ట్రోల్స్

TRS Vs BJP | వడ్లకు, గోధుమలకు తేడా తెలియదా..? బీజేపీపై టీఆర్ఎస్ ట్రోల్స్

HT Telugu Desk HT Telugu
Apr 11, 2022 02:49 PM IST

ధాన్యం సేకరణపై బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా సాగుతోంది. అయితే ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నా చేస్తుంటే.. హైదరాబాద్ లో బీజేపీ నిరసన తెలుపుతోంది. అయితే ఇందులో ఓ ఇంట్రస్టింగ్ పోస్టర్ టీఆర్ఎస్ కు దొరికింది. దీంతో బీజేపీపై ట్రోల్స్ మెుదలుపెట్టింది.

<p>ఫ్లెక్సీతో బీజేపీని ట్రోల్ చేస్తున్న టీఆర్ఎస్</p>
ఫ్లెక్సీతో బీజేపీని ట్రోల్ చేస్తున్న టీఆర్ఎస్ (twitter)

కేంద్రమే ధాన్యం.. కొనుగోలు చేయాలని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ధర్నాకు దిగింది. మరోవైపు రైతులకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలంటూ.. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర.. బీజేపీ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే.. బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ.. ఇప్పుడు విమర్శల పాలైంది. నిరసన తెలిపేప్పుడు.. ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా ఫ్లెక్సీల విషయంలో అన్ని సరిగా ఉన్నాయో లేదో చూడాలి. లేకుంటే ప్రత్యర్థి పార్టీకి దొరికిపోయి.. ట్రోల్స్ కు గురికావాల్సి వస్తుంది.

తాజాగా బీజేపీ నేతలు ఇందిరా పార్క్ దగ్గర్ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో ఏం ఉందంటే.. బండి సంజయ్‌ ఫొటోతో పాటు వరి ధాన్యం స్థానంలో గోధుమల ఫోటోలు ఉన్నాయి. దీంతో టీఆర్‌ఎస్‌ నేతలు ట్రోల్ మెుదలుపెట్టారు. వరికి, గోధుమలకు తేడా తెలియని సన్నాసులు అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు ఢిల్లీలో పోరాడుతుంటే.. బీజేపీ నేతలు.. హైదరాబాద్ లో పోరాడితే ఏం లాభమని.. టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రైతులకు న్యాయం చేసే విషయంలో బీజేపీ నేతలు ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తే.. లాభం ఉండేదని చెబుతున్నారు.

మరోవైపు.. ఢిల్లీలో తెలంగాణ భవన్ దగ్గర బీజేపీ నేతలు పోస్టర్లు వేశారు. వడ్లు కొను లేదా గద్దె దిగు అంటూ పోస్టర్లు అతికించారు. తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో రెండు పార్టీల పోస్టర్లు వెలిశాయి. 'ఒక దేశం-ఒక ఆహార ధాన్యం సేకరణ విధానం' అనే డిమాండ్‌‌తో, ధాన్య సేకరణ అంశం దేశవ్యాప్త సమస్యగా తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిరసన జరుగుతోంది.

మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు.. తెలంగాణ భవన్ దగ్గరలో పోస్టర్లు అంటించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆ పోస్టర్‌లో ‘కేసీఆర్, బియ్యం సేకరించడంలో మీ సమస్య ఏమిటి. ఈ ధర్నా ఎందుకు? ఇది రాజకీయాల కోసమా లేదా రైతుల కోసం? మీకు వీలైతే బియ్యం కొనండి. లేకపోతే గద్దె దిగండి..’ అంటూ డిమాండ్ చేశారు.

తెలంగాణ రైతుల నుంచి వరిధాన్యాన్ని కేంద్రం సేకరించడం లేదని తెలంగాణ అధికార పార్టీ ఆరోపిస్తోంది. దేశంలో ఏకరూప సేకరణ విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తెలంగాణలోని నాలుగు జాతీయ రహదారులను దిగ్బంధించారు. ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో లేవనెత్తే క్రమంలో ఢిల్లీలో కేసీఆర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతోంది.

Whats_app_banner