Hyderabad Traffic Alert : సద్దుల బతుకమ్మ ఎఫెక్ట్... రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు - రూట్లు ఇవే-traffic police issue traffic advisory in view of saddula bathukamma celebrations on 22 october 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Traffic Alert : సద్దుల బతుకమ్మ ఎఫెక్ట్... రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు - రూట్లు ఇవే

Hyderabad Traffic Alert : సద్దుల బతుకమ్మ ఎఫెక్ట్... రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు - రూట్లు ఇవే

HT Telugu Desk HT Telugu
Oct 21, 2023 08:28 AM IST

Traffic Restrictions in Hyderabad : వాహనదారులకు అలర్ట్ ఇచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అక్టోబరు 22న సద్దుల బతుకమ్మ సందర్భంగా… పలు రూట్లలో వాహనాలను మళ్లిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పూర్తి వివరాలను పేర్కొన్నారు.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad City :అక్టోబర్ 22న సద్దుల పండుగ సందర్బంగా నగరంలోని ప్రజలకు,వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.ట్రాఫిక్ మల్లింపులు,రద్దీ పాయింట్లను తెలిపారు. లుంబిని పార్క్,అప్పర్ ట్యాంక్ బండ్ చుట్టూ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ మళ్లింపు,రద్దీ పాయింట్లు,పార్కింగ్ ఏరియా లను సూచించారు.ఈ మేరకు. ప్రజలు,వాహనదారులు సూచించిన ట్రాఫిక్ మల్లింపులను జాగ్రత్తగా గమనించి,పాటించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని వారు కోరారు.

ఈ క్రింది ప్రదేశాల్లో ట్రాఫిక్ మళ్లింపు :

• ఇక్బాల్ మినార్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించకుండా తెలుగు ట్యాలీ ఫ్లైఓవర్-కట్టమైసమ్మ- DBR- ఇందిరా పార్క్-గాంధీనగర్- RTC క్రాస్ రోడ్డు వైపు మళ్లిస్తారు.

• V.V నుండి వచ్చే ట్రాఫిక్ ఎన్టీఆర్ మార్గ్ వైపు ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం (నెక్లెస్ రోటరీ) వద్ద ప్రసాద్ ఐమాక్స్ మరియు మింట్ లేన్ వైపు మళ్లించబడుతుంది.నల్లకుంట జంక్షన్ నుండి వచ్చే ట్రాఫిక్ కు బుద్ధ భవన్ వైపు అనుమతి లేదు ఆ ట్రాఫిక్ ను నల్లగుట్ట క్రాస్ రోడ్స్ వద్ద రాణిగంజ్ మరియు నెక్లెస్ రోడ్డు వైపు మళ్లిస్తారు.

• తెలుగుతల్లి జంక్షన్ మరియు కర్బలా మైదాన్ నుండి ట్యాంక్ బండ్‌కు వచ్చే సాధారణ ట్రాఫిక్ అక్టోబర్ 22న మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అనుమతి లేదు.

• లిబర్టీ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇక్బాల్ మినార్ ‘యు’ మలుపు మీదుగా తెలుగు ట్యాలీ జంక్షన్ మీదుగా తెలుగు ట్యాలీ ఫ్లైఓవర్ వైపు మళ్లించబడుతుంది.

• సికింద్రాబాద్ నుండి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్ కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్-జబ్బార్ కాంప్లెక్స్- కవాడిగూడ-లోయర్ ట్యాంక్ బండ్-కట్టమైసమ్మ మరియు తెలుగు ట్యాలీ ఫ్లైఓవర్ వైపు మళ్లించబడుతుంది.

• ముషీర్‌బాద్ మరియు కవాడిగూడ నుండి వచ్చే ట్రాఫిక్ కు

చిల్డ్రన్స్ పార్క్ - అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లేందుకు అనుమతి లేదు కాగా ఆ ట్రాఫిక్ ను DBR మిల్స్ వద్ద లోయర్ ట్యాంక్‌బండ్-కట్టమైసమ్మ వైపు మళ్లించబడుతుంది.

RTC బస్సులు మళ్లింపు

• మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు సికింద్రాబాద్ నుండి MGBS వైపు వచ్చే అన్ని అంతర్జిల్లా RTC బస్సులను స్వీకర్-ఉపాకర్ జంక్షన్ వద్ద YWCA-సంగీత్-మెట్టుగూడ-తార్నాక-నల్లకుంట-ఫీవర్ హాస్పిటల్ క్రాస్ రోడ్-బర్కత్‌పురా-పర్యాటక హోటల్-నింబోలి అడ్డా- MGBS-రంగమహల్-రంగం వైపు మళ్ళిస్తారు.

• మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు

సిటీ బస్సులను కర్బలా మైదాన్‌లో బైబిల్ హౌస్-జబ్బార్ కాంప్లెక్స్ వద్ద కవాడిగూడ క్రాస్ రోడ్స్ - లోయర్ ట్యాంక్ బండ్ - కట్టమైసమ్మ- తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్ళిస్తారు

• వి.వి. విగ్రహం, ఖైరతాబాద్ పాత PS, సైఫాబాద్ ఇక్బాల్ మినార్ ,తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ లిబర్టీ, రవీంద్ర భారతి ,అంబేద్కర్ విగ్రహం ,ట్యాంక్ బండ్, కవాడిగూడ క్రాస్ రోడ్స్, కట్టమైసమ్మ, కర్బలా మైదాన్, రాణిగంజ్ నల్లగుట్ట...రద్దీ ఎక్కువగా ఉండే ఈ జుంక్షన్లలో ప్రయాణాన్ని అవాయిడ్ చేయాలని ట్రాఫిక్ పోలీసులు వాహనదారులను కోరుతున్నారు

పార్కింగ్ పాయింట్లు

• స్నో వరల్డ్

• ఎన్టీఆర్ స్టేడియం మరియు

• ఎన్టీఆర్ గార్డెన్ పక్కన

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

Whats_app_banner