Hyderabad : డ్రైనేజ్ మ్యాన్హోల్లోకి రిపేర్ కోసం దిగి... ముగ్గురు కూలీలు మృతి
Hyderabad District News: హైదరాబాద్ లోని జియాగుడలో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజ్ పైప్ లైన్ రిపేర్ కోసం దిగిన ముగ్గురు కూలీల మృత్యువాత చెందారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
HyderabadCrime News: హైదరాబాద్ నగరంలో విషాద ఘటన వెలుగు చూసింది. మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. ఈ దుర్ఘటన నగరంలోని జియాగూడలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు వివరాల ప్రకారం…. శుక్రవారం కుల్సుంపుర వద్ద ఉన్న మ్యాన్ హోల్ లోకి 40 ఏళ్ల కార్మికుడు లోపలికి వెళ్లాడు. అయితే అతను లోపలికి వెళ్లిన తర్వాత కుప్పకూలిపోవటంతో…. బయట ఉన్న మరో ఇద్దరు లోపలికి వెళ్లి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఇద్దరు కూడా అపస్మారకస్థితిలోకి వెళ్లిరారు. ఈ ఘటనలో ఒకరని ఆస్పత్రికి తరలించగా… చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ఇద్దరి మృతదేహాలను డీఆర్ఎఫ్ సిబ్బంది బయటికి తీసుకుంది. మురుగు కాలవలను పరిశుభ్రం చేసేందుకు ఈ ముగ్గురిని ఓ ప్రైవేట్ ఏజెన్సీ నియమించుకున్నట్లు పేర్కొన్నారు.
మృతులను శ్రీనివాస్ (40), హనుమంతు (40), వెంకట్రాములు (48)గా గుర్తించారు. వీరంతా పాలమూరు జిల్లాకు చెందినవారని తెలిసింది. విషవాయులు పీల్చుకోవటంతోనే చనిపోయినట్లు సమాచారం. సేఫ్టీ మెజర్స్మెంట్స్ విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోకపోవటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సదరు ప్రైవేటు ఏజెన్సీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రి హత్య….
ఇక మెదక్ జిల్లాలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. తాగుడుకు బానిసై పనిపాట లేకుండా తిరుగుతున్న కొడుకుని మందలించాడన్న కోపంతో కన్నతండ్రిని కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలో శుక్రవారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూచారం గ్రామానికి చెందిన బొంతపల్లి చంద్రయ్య (46),నర్సమ్మ దంపతులకు ఒక కూతురు,ఒక కొడుకు ఉన్నాడు. కాగా కూతురు వివాహం చేశారు. కొడుకు ప్రశాంత్ ఏ పని చేయకుండా మద్యానికి బానిసై జులాయిగా తిరుగుతున్నాడు. కష్టపడి పని చేసుకోవాలని,అలా తాగి ఆరోగ్యం పాడుచేసుకోవద్దని నిత్యం చెబుతుండేవాడు. కానీ కుమారుడు తరచూ మద్యం తాగి వచ్చి తండ్రితో గొడవపడేవాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం చంద్రయ్య ఇంట్లో పడుకొని ఉన్నాడు. ఆ సమయంలో కుమారుడు ప్రశాంత్ ఇంటికి వచ్చి ఫ్యాన్ వేసుకోవడంతో తండ్రి, కొడుకుల మద్య గొడవ జరిగింది. ఆవేశానికి గురైన ప్రశాంత్ ఇంట్లో ఉన్న గొడ్డలి కామతో తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కాగా వెంటనే కుటుంబసభ్యులు 108 వాహనంలో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి,పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ తీసుకెళ్లామని సూచించారు. కానీ కుటుంబసభ్యులు ఉదయాన్నే హైదరాబాద్ తీసుకెళ్తామని చంద్రయ్యను రాత్రి ఇంటికి తీసుకెళ్లారు. దీంతో చంద్రయ్య పరిస్థితి విషమించి రాత్రి 11 గంటలకు మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.