Damagundam Foundation: దామగుండం రాడార్ కేంద్రానికి నేడు శంకుస్థాపన చేయనున్న కేంద్రమంత్రి,బీఆర్‌ఎస్‌,ప్రజా సంఘాల అభ్యంతరం-the union minister will lay the foundation stone for the damagundam radar center today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Damagundam Foundation: దామగుండం రాడార్ కేంద్రానికి నేడు శంకుస్థాపన చేయనున్న కేంద్రమంత్రి,బీఆర్‌ఎస్‌,ప్రజా సంఘాల అభ్యంతరం

Damagundam Foundation: దామగుండం రాడార్ కేంద్రానికి నేడు శంకుస్థాపన చేయనున్న కేంద్రమంత్రి,బీఆర్‌ఎస్‌,ప్రజా సంఘాల అభ్యంతరం

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 15, 2024 09:26 AM IST

Damagundam Foundation: నిరసనలు, అభ్యంతరాల మధ్యే దామగుండం రాడార్‌ కేంద్రం ఏర్పాటుకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలంలోని అటవీ ప్రాంతంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.

దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు
దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు

Damagundam Foundation: దామగుండం అటవీ ప్రాంతంలో భారత నౌకాదళానికి సంబంధించిన `వెరీ లో ఫ్రీక్వెన్సీ' కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్ కేంద్రానికి నేడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేయనున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుంది.

కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ వికారాబాద్‌ జిల్లా ప్రజాప్రతినిధుల్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దామగుండం సమీపంలోని వికారాబాద్ మండలం ఉందుర్గు తండా లో పైలాన్ ఏర్పాటుచేశారు. పైలాన్‌ సమీపంలోనే దాదాపు 500 మందితో సమావేశం నిర్వహిస్తారు.

ఈస్ట్రర్న్‌ నావల్ కేంద్రానికి బాధ్యతలు..

విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న 'ఈస్టర్న్ నావెల్ కమాండ్‌కు ఆరు నెలల దామగుండం ప్రాంతాన్ని అప్పగించారు. ఇక్కడ నేవీ రాడార్ స్టేషన్‌తో ప పాటు టౌన్‌షిప్ నిర్మిస్తారు. ఇందులో పాఠశాలలు, ఆసుపత్రి, బ్యాంక్, మార్కెట్ వంటి సదుపా యాలుంటాయి. కొత్తగా ఏర్పాటు చేసే నేవీ యూనిట్లో సుమారు 600 మంది ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఉంటారు.

వ్యూహాత్మక కేంద్రం…

పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలం దామగుండం రిజర్వు ఫారెస్టులో భారత నౌకాదళానికి సంబంధించిన నేవీ రాడార్‌ కేంద్రాన్ని పదేళ్ల క్రితమే ఏర్పాటు చేయాలని భావించినా సాధ్యం కాలేదు. కేంద్ర పర్యావరణశాఖ నుంచి స్టేజ్‌ -2 అనుమతులు లభించడంతో ముందడుగు పడింది. రాడార్ కేంద్రం ఏర్పాటును పర్యావరణ ప్రేమికులు, సామాజిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దామగుండం రిజర్వు ఫారెస్టు ఏరియా విస్తీర్ణం - 3260 ఎకరాల్లో ఉండగా రాడార్‌ స్టేషన్‌కు కేటాయించిన భూమి - 2900 ఎకరాలను కేటాయించారు. అందులో సుమారు - 1,93,562 మొక్కలు, చెట్లు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.3100కోట్ల అంచనాతో ప్రారంభిస్తున్నారు.

మూసీ భవిష్యత్తుపై కేటీఆర్ ఆందోళన…

దామగుండంలో నేవీ రాడార్ స్టేషన్‌ ఏర్పాటుతో మూసీ నది కనుమరుగు అవుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేటిఆర్ తెలిపారు.

"ఓ వైపు మూసీ సుందరీక్షణ ప్రాజెక్టు పేరుతో కోట్లు ఖర్చు చేస్తామని చెబు తూనే.. మరోవైపు ఆ నదిని పూర్తిగా ప్రమాదంలో పడేసే రాడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం చెప్పడమేమిటి? ఇదెక్కడి ద్వంద్వ వైఖరి? అని ప్రశ్నించారు.

దామగుం డంలో రాడార్ ఏర్పాటు కారణంగా పర్యావరణానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని, దాదాపు 2900 ఎకరాల అటవీ భూభాగంలో 12 లక్షల చెట్లను నరికేసి రాడార్ స్టేషన్ను నిర్మిస్తారని, గంగానది జన్మస్థానం గంగోత్రి వద్ద 150 కిలోమీటర్ల పరిధిని కేంద్రం 'ఏకో సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించారని గంగోత్రికి ఒక న్యాయం.. మూసీ నదికి మరో న్యాయమా? మూసీ నది పుట్టిన ప్రాంతాన్ని కూడా 'ఏకో సెన్సిటివ్ జోన్' గా ప్రకటించాలని కేటీఆర్ పేర్కొన్నారు.

Whats_app_banner