TG Staff Nurse Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల-tg govt 2050 staff nurse posts notification released online application start sep 28th ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Staff Nurse Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TG Staff Nurse Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Bandaru Satyaprasad HT Telugu
Sep 18, 2024 10:04 PM IST

TG Staff Nurse Notification : తెలంగాణ సర్కార్ 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TG Staff Nurse Notification : తెలంగాణ ప్రభుత్వం 2050 నర్సింగ్ ఆఫీసర్స్ (స్టాఫ్ నర్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్)ల నియామకంలో భాగంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ మెడికల్ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో 1576 పోస్టులను భర్తీ చేయనున్నారు .

తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 332 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయుష్ శాఖలో 61 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ లో 1 నర్సింగ్ ఆఫీసర్ ను భర్తీ చేయనున్నారు. ఎంఎన్జీ క్యాన్సర్ ఆసుపత్రిలో 80 మంది నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్య తేదీలు

ఆన్‌లైన్ అప్లికేషన్లు సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభం అవుతాయి. ఆన్‌లైన్ దరఖాస్తులను అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5.00 గంటల లోపు సమర్పించారు. అభ్యర్థులు తమ అప్లికేషన్లను అక్టోబర్ 16 ఉదయం 10.30 నుంచి 17వ తేదీ సాయంత్ర 5.00 వరకు సవరించుకోవచ్చు. సీబీటీ విధానంలో పరీక్షను నవంబర్ 17, 2024 నిర్వహిస్తారు.

అర్హులైన అభ్యర్థు బోర్డు వెబ్‌సైట్‌ https://mhsrb.telangana.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

  • పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్సు) పోస్టులు - 1576
  • తెలంగాణ వైద్య విధాన పరిషత్ స్టాఫ్ నర్స్ పోస్టులు - 332
  • ఆయుష్ స్టాఫ్ నర్స్ పోస్టులు - 61
  • ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ స్టాఫ్ నర్స్ - 1
  • ఎంఎన్జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ కేంద్రం స్టాఫ్ నర్స్ పోస్టులు - 80
  • మొత్తం పోస్టులు - 2050
  • ఈ పోస్ట్‌లకు సంబంధించి పే స్కేల్ రూ.36,750 – రూ.1,06,990 వరకు

అభ్యర్థులను 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కుల శాతానికి గరిష్టంగా 80 పాయింట్లు(80 మార్కులకు పరీక్ష నిర్వహణ), మిగిలిన 20 పాయింట్లు రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో సేవలు(కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆసుపత్రులు/ సంస్థలు/ కార్యక్రమాలు) అందించిన వారికి కేటాయిస్తారు.

పరీక్ష ఫీజు :

ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా రూ. 500 చెల్లించాలి. ఈ కేటగిరీ కింద ఎలాంటి ఫీజు మినహాయింపు లేదు.

దరఖాస్తు రుసుము :

దరఖాస్తుదారు తప్పనిసరిగా రూ. 200 చెల్లించారు. అయితే దరఖాస్తు రుసుముపై వివిధ వర్గాలకు మినహాయింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్, తెలంగాణ మాజీ సైనికులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి అవసరం లేదు. 18 నుంచి 46 సంవత్సరాల వయస్సు గల తెలంగాణకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

సంబంధిత కథనం