Frog In Biryani: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఘోరం.. బిర్యానీలో చచ్చిన కప్ప కళేబరం, విద్యార్థుల ఆందోళన
Frog In Biryani: ఆదివారం సెలవు రోజు మెస్‌లో బిర్యానీ తిందామని వెళ్లిన విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మెస్‌లో బిర్యానీలో కప్ప కనిపించడంతో ఖంగుతిన్నారు. ఈ ఘటన గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో చోటు చేసుకుంది. దీనిపై విద్యార్థులు ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
Frog In Biryani గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో వడ్డించిన బిర్యానీలో కప్పను చూసి ఖంగుతిన్నారు. మెస్‌లో ఆహారం నాణ్యతపై ట్విట్టర్‌లో ఫుడ్ సేఫ్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. గత వారం ట్రిపుల్‌ఐటీ కదంబ మెస్‌లో వడ్డించిన బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. బిర్యానీలో కప్ప రావడానికి మెస్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
ట్రిపుల్ ఐటీ మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. బిర్యానీలో కప్ప ప్రత్యక్షమైన ఫొటోను విద్యార్థులు ట్విటర్‌లో షేర్ చేశారు. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫుడ్‌సేఫ్టీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోని కదంబ మెస్‌లో వడ్డించిన చికెన్ బిర్యానీలో కప్ప కళేబరం ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు కంగుతిన్నారు. గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్ క్యాంపస్‌లో విద్యార్థులకు వేర్వేరు మెస్‌లున్నాయి. గత బుధవారం అక్టోబర్ 16న మధ్యాహ్నం కదంబ మెస్‌లో భోజనం చేస్తుండగా ఓ విద్యార్థికి వడ్డించిన చికెన్ బిర్యానీలో కప్ప కనిపించింది. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ వ్యవహారంపై మెస్ సిబ్బందికి, ఇన్‌ఛార్జికి ఫిర్యాదుచేశారు.
ఈ ఘటన వెలుగు చూసిన వెంటనే మెస్ సిబ్బంది కప్ప కనిపించిన బిర్యానీతో పాటు ఇతర ఆహార పదార్థాలను బయటపడేశారు. హాస్టల్‌లో పరిస్థితులపై ఆందోళన చెందిన విద్యార్థులు మెస్‌లో శుభ్రత పాటించడం లేదనీ.. ఆహారంలో పురుగులు, కప్పలు వస్తున్నాయని, ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌చేశారు. చికెన్ బిర్యానీలో కప్ప కనిపించిన ఫోటోలను విద్యార్థులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కదంబ మెస్‌లో దారుణ పరిస్థితులుఉన్నాయని ఆరోపించారు.
ట్రిపుల్ ఐటీ వర్గాలు కూడా స్పందించాయి. విద్యార్థులకు వడ్డించిన భోజనంలో చనిపోయిన కప్ప కళేబరం ప్రత్యక్షమైన ఘటనపై విచారణ జరుపుతున్నట్టు వర్శిటీ ప్రకటించింది. తప్పు ఎక్కడో జరిగిందో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని ట్రిపుల్ ఐటీ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూస్తామని, హాస్టల్ మెస్ నిర్వహణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.