TS IPS Heart Stroke: గుండెపోటుతో తెలంగాణ విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్‌ కన్నుమూత-telangana vigilance dg rajeev ratan passed away due to heart attack ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ips Heart Stroke: గుండెపోటుతో తెలంగాణ విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్‌ కన్నుమూత

TS IPS Heart Stroke: గుండెపోటుతో తెలంగాణ విజిలెన్స్‌ డీజీ రాజీవ్ రతన్‌ కన్నుమూత

Sarath chandra.B HT Telugu

TS IPS Heart Stroke: తెలంగాణ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్‌ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. ఉదయం తీవ్రమైన ఛాతీనొప్పితో బాధపడటంతో ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే కన్నుమూశారు.

గుండెపోటుతో కన్నుమూసిన తెలంగాణ డీజీ రాజీవ్ రతన్

TS IPS Heart Stroke: తెలంగాణ క్యాడర్‌ సీనియర్ ఐపీఎస్‌ IPS అధికారి రాజీవ్‌ రతన్  Rajiv Ratan గుండెపోటు heart attackతో కన్నుమూశారు. 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌ రతన్‌ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ DG Vigilance డీజీగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం ఛాతీనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే ఏఐజి ఆస్పత్రికి AIG Hospital తరలించారు.

1991 బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్‌ను ఇటీవల విజిలెన్స్ డీజీ గా నియమించారు. విజిలెన్స్ డీజీగా నియమించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిపారు. రాజీవ్ రతన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది.

సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్‌ రతన్‌ గతంలో పలు హోదాల్లో పనిచేశారు. తెలంగాణ పోలీస్‌ హౌసింగ్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గాను విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా విధులు నిర్వహిస్తున్నారు.

రాజీవ్‌ రతన్‌ 1991 ఐపీఎస్‌ బ్యాచ్‌కి చెందిన ఆఫీసర్‌. గత ఏడాది మహేందర్‌రెడ్డి డీజీపీగా పదవీ విరమణ చేసిన సమయంలో కొత్త పోలీస్‌ బాస్‌ రేసులో రాజీవ్‌ రతన్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. రాజీవ్ రతన్ మృతి పట్ల పలువురు ఐపీఎస్‌ అధికారులు సంతాపం వ్యక్తం చేశారు.