Yadadri Trip : యాదాద్రి ట్రిప్ - రూ.1499కే వన్ డే టూర్ ప్యాకేజీ, ఈ టూరిస్ట్ స్పాట్స్‌ కూడా చూడొచ్చు..!-telangana tourism operate one day yadagirigutta tour package from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yadadri Trip : యాదాద్రి ట్రిప్ - రూ.1499కే వన్ డే టూర్ ప్యాకేజీ, ఈ టూరిస్ట్ స్పాట్స్‌ కూడా చూడొచ్చు..!

Yadadri Trip : యాదాద్రి ట్రిప్ - రూ.1499కే వన్ డే టూర్ ప్యాకేజీ, ఈ టూరిస్ట్ స్పాట్స్‌ కూడా చూడొచ్చు..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 22, 2024 05:01 PM IST

Hyderabad - Yadagirigutta Tour Package : యాదాద్రికి వెళ్లేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….

యాదాద్రి టూర్ ప్యాకేజీ
యాదాద్రి టూర్ ప్యాకేజీ

Telangana Tourism Yadagirigutta Tour Package : పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూసేందుకు తెలంగాణ టూరిజం అనేక రకాల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా యాదాద్రితో పాటు మరికొన్ని ఆలయాలను చూసేందుకు కొత్త ప్యాకేజీని ప్రకటించింది.

కేవలం ఒక్క రోజులోనే ఈ టూర్ ముగుస్తుంది. అతి తక్కువ ధరలోనే ప్రతి శనివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. బస్సు జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

హైదరాబాద్ - యాదగిరిగుట్ట టూర్ షెడ్యూల్…

  • తెలంగాణ టూరిజం YADAGIRIGUTTA PACKAGE TOUR ను ప్రకటించింది.
  • హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
  • ప్రతి శనివారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
  • ఏసీ మినీ కోచ్ లో జర్నీ ఉంటుంది.
  • కేవలం ఒకే ఒక్క రోజులో ఈ ప్యాకేజీ ముగుస్తుంది.
  • ఉదయం 9 గంటలకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి స్టార్ట్ అవుతారు.
  • 10:30 గంటలకు కొలనుపాకకు చేరుకుంటారు. పురాతన జైన్ ఆలయాన్ని దర్శించుకుంటారు.
  • 11:30 AM గంటలకు కొలనుపాక నుంచి బయల్దేరుతారు.
  • 12:30 PMకు యాదగిరిగుట్టలోని ఆలయాన్ని సందర్శిస్తారు.
  • 1:30 PM to 2:00 PM హరిత హోటల్ లో భోజనం చేస్తారు.
  • 4:30 PM సురేంద్రపురికి వెళ్తారు. ఇక్కడ ప్రముఖ ఆలయాల సెట్టింగ్ లను చూస్తారు,
  • 9:30 PM గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు.
  • https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుకోవచ్చు.
  • ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 1499, పిల్లలకు రూ.1199గా నిర్ణయించారు.

కశ్మీర్ టూర్ ప్యాకేజీ…

భూతలస్వర్గమైన కశ్మీర్ కు వెళ్లే ప్లాన్ ఉందా..? అయితే హైదరాబాద్ నుంచి IRCTC టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. టూర్ షెడ్యూల్ పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….

హైదరాబాద్ - కశ్మీర్ షెడ్యూల్ వివరాలు:

  • Hyderabad- Leh : మొదటిరోజు హైదరాబాద్ నుంచి ఉదయం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. ఉదయం 10 గంటలకు లేహ్ కు చేరుకుంటారు. పలు ప్రాంతాలను చూస్తారు.
  • Leh- Sham Valley- Leh (75 km 02 hrs one way) : బ్రేక్ ఫాస్ట్ తర్వాత Leh- Srinagar Highwayపై జర్నీ ఉంటుంది. ఇక్కడ ఉన్న Hall of Fame మ్యూజియంను సందర్శిస్తారు. Zorawar Fortతో పాటు Gurudwara Patthar Sahib కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శాంతి స్తూపాకు వెళ్తారు. రాత్రికి లేహ్ లోనే ఉంటారు.
  • Leh - Nubra : బ్రేక్ ఫాస్ట్ తర్వాత…. Nubra వ్యాలీకి వెళ్తారు. ప్రపంచంలోనే ఎత్తైన మోటారు రహదారి. మధ్యాహ్న భోజనం తర్వాత భారతదేశంలోని ఉత్తర ప్రాంతంలో నివసించే ప్రజల జీవన శైలిని చూడొచ్చు. సాయంత్రం ఒంటె సఫారీని ఉంటుంది. రాత్రికి నుబ్రా వ్యాలీలోనే రాత్రి బస చేస్తారు.
  • Nubra – Turtuk – Nubra : టిఫిన్ చేసి తర్వాత ప్యాంగాగ్ కు వెళ్తారు. ఇక్కడ ఉండే ఉప్పునీటి సరసును చూస్తారు. ఇది భారత్ - చైనా మధ్య అంతర్జాతీయ సరిహద్దు ద్వారా విభజించబడి ఉంటుంది. ఈ సరస్సు ఒడ్డున ప్రకృతి అందాలు అద్భుతంగా ఉంటాయి.
  • Pangong – Leh via Changla : అత్యంత ఎత్తైన ప్రాంతం నుంచి సూర్యోదయాన్ని వీక్షిస్తారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత లేహ్ కు వెళ్తారు. Thiksey Monastery, Shey Palaceను సందర్శిస్తారు. రాత్రికి లేహ్ లో ఉంటారు.
  • Leh Airport Drop : లేహ్ ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాద్ కు బయల్దేరుతారు.
  • కంఫార్ట్ క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీకి 65670గా నిర్ణయించారు. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 60200ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 60755గా ఉంది.
  • చిన్న పిల్లలకు వేర్వురు ధరలను నిర్ణయించారు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
  • ఏమైనా సందేహాలు ఉంటే IRCTC టూరిజం జోనల్ ఆఫీస్ 040-27702407 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.,

Whats_app_banner