(1 / 6)
అనంతగిరి హిల్స్.... హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉండే ప్రాంతం. ఒక్క మాటలో చెప్పాలంటే...ఈ ప్రాంతాన్ని తెలంగాణ అరకులోయగా అభివర్ణించవచ్చు. ఇక్కడి పచ్చదనం, లోయలు, జలపాతాలు చూస్తే... ప్రతి మనసును కట్టిపడేస్తాయి.
(Image Source Twitter)(2 / 6)
ఈ అద్భుతమైన ప్రాంతాన్ని చూసేందుకు తెలంగాణ టూరిజం వన్ డే టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా తీసుకెళ్తుంది.
(Image Source Twitter)(3 / 6)
ఒక్కరోజులోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. ప్రతి వారంలో శనివారం, ఆదివారం తేదీల్లో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.HYDERABAD TO ANANTHAGIRI BACK ONE DAY PACKAGE TOUR’ పేరుతో ఆపరేట్ చేస్తుంది.
(Image Source Twitter)(4 / 6)
షెడ్యూల్ చూస్తే… ఉదయం 09 గంటలకు సికింద్రాబాద్ లోని యాత్రి నివాస్ నుంచి బస్సు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అనంతగిరి చేరుకుంటారు. మొదటగా అనంత పద్మనాభస్వామిని దర్శించుకుంటారు. 12.30 PM to 01.30 PM - ఫారెస్ట్ విజిట్ ఉంటుంది.
01.30 PM to 02.30 PM - హరిత హోటల్ లో లంచ్ ఉంటుంది.
(Image Source Twitter)(5 / 6)
02.30 PM to 04.30 PM - గేమ్స్ ఉంటాయి. 04.30 PM to 05.00 PM - టీ, స్నాక్స్ ఇస్తారు.
05.00 PM - అనంతగిరి నుంచి బయల్దేరుతారు. 08.00 PM - హైదరాబాద్ చేరుకోవటంతో ఈ ట్రిప్ ముగుస్తుంది.
(Image Source Twitter)(6 / 6)
హైదరాబాద్ - అనంతగిరి టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 1800, పిల్లలకు రూ. 1440గా ఉంది. నాన్ ఏసీ బస్సులో వెళ్లాల్సి ఉంటుంది.ఈ ప్యాకేజీని బుకింగ్ కోసం 9848540371 ఫోన్ నెంబర్ లేదా https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
(Image Source Twitter)ఇతర గ్యాలరీలు