Governor On TSPSC Chairman: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా అమోదించని గవర్నర్-telangana public service commission chairmans resignation not approved by governor tamil sai ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Governor On Tspsc Chairman: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా అమోదించని గవర్నర్

Governor On TSPSC Chairman: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామా అమోదించని గవర్నర్

Sarath chandra.B HT Telugu
Dec 12, 2023 11:25 AM IST

Governor On TSPSC Chairman: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజీనామాను గవర్నర్‌ తమిళి సై అమోదంచ లేదు. టిఎస్‌పిఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఛైర్మన్‌పై చర్యలు తీసుకోవాలంటూ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌కు లేఖ రాశారు.

గవర్నర్ తమిళి సై
గవర్నర్ తమిళి సై

Governor On TSPSC Chairman: టిఎస్‌పిఎస్సీ చైర్మన్ రాజీనామా వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. ఛైర్మన్ రాజీనామాను అమోదించ కూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ నిర్వహించిన పలు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో బాధ్యులు ఎవరో తేల్చకుండా ఛైర్మన్ రాజీనామాను అమోదించకూడదని గవర్నర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రితో భేటీ తర్వాత టిఎస్‌పిఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. జనార్థన్ రెడ్డి రాజీనామాను గవర్నర్ అమోదించినట్టు కథనాలు వెలువడినా, మంగళవారం గవర్నర్ సమ్మతి తెలపలేదని ప్రకటించారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్ నిర్వహణలో జరిగిన అక్రమాలకు బాధ్యులెవరో తేల్చాల్చి ఉందని, ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసులు దర్యాప్తు దశలో ఉన్నందున కమిషన్ ఛైర్మన్ రాజీనామా అమోదిస్తే అసలు దోషులు తప్పించుకునే అవకాశం ఉంటుందని గవర్నర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. పేపర్ లీక్ అంశంలో బాధ్యులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిఓపిటికి గవర్నర్‌ లేఖ రాశారు. మరోపు మంగళవారం టిఎస్‌పిఎస్పీ‌పై తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.

ఛైర్మన్ రాజీనామా అమోదించకపోతే ఆయనతోనే కార్యకలాపాలు కొనసాగించాల్సి ఉంటుంది. కొత్త ఛైర్మన్‌ ఎంపిక, నోటిఫికేషన్ల విడుదలపై కూడా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి.

Whats_app_banner