TG LAWCET 2024 Updates : లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఆగస్టు 5 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, ముఖ్య తేదీలివే!-telangana lawcet counseling schedule 2024 released key dates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Lawcet 2024 Updates : లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఆగస్టు 5 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, ముఖ్య తేదీలివే!

TG LAWCET 2024 Updates : లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఆగస్టు 5 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, ముఖ్య తేదీలివే!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 24, 2024 09:22 AM IST

TG Lawcet Counseling 2024 : తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 5 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ 2024
తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ 2024

TG Lawcet Counseling 2024 : తెలంగాణ లాసెట్ అభ్యర్థులకు అప్డేట్ వచ్చేసింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఇవాళ నోటిఫికేషన్ ను ఖరారు చేయగా… ఆగస్టు 5వ తేదీ నుంచి ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ముఖ్య తేదీలివే:

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 20వ తేదీతో ముగియనుంది. రిజిస్ట్రేషన్ల కోసం రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు మాత్రం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆగస్టు 22వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. 23వ తేదీతో ఈ గడువు పూర్తి అవుతుంది. ఆగస్టు 24వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఆగస్టు 27వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. 

సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 28 నుంచి 30వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చు. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు త్వరలోనే ఖరారు కానున్నాయి.

లాసెట్ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి….

ఈ ఏడాది జరిగిన తెలంగాణ లాసెట్ పరీక్షకు 40,268 మంది హాజరయ్యారు. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు. మొత్తంగా 72.66 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

  • లాసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు మొదటగా https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
  • -గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
  • అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.

2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహించింది. ఈ ఏడాదికి సంబంధించి జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలను నిర్వహించారు. ఉద‌యం 9 నుంచి 10.30 వ‌ర‌కు మొదటి సెషన్ జరిగింది. ఇక మ‌ధ్యాహ్నం 12.30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్, సాయంత్రం 4 నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు మూడో సెషన్ పరీక్షను నిర్వహించారు. గతేడాదితో పోల్చితే ఈసారి లాసెట్ కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.

Whats_app_banner