TG LAWCET 2024 Updates : తెలంగాణ లాసెట్ ప్రవేశాలు - కౌన్సెలింగ్ ఎప్పుడంటే..?-ts lawcet counseling is likely to be held in the first week of august 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Lawcet 2024 Updates : తెలంగాణ లాసెట్ ప్రవేశాలు - కౌన్సెలింగ్ ఎప్పుడంటే..?

TG LAWCET 2024 Updates : తెలంగాణ లాసెట్ ప్రవేశాలు - కౌన్సెలింగ్ ఎప్పుడంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 17, 2024 09:35 AM IST

TG Lawcet Counselling : తెలంగాణ లాసెట్ అభ్యర్థులు కౌన్సెలింగ్ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆగస్ట తొలి వారంలో షెడ్యూల్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ 2024
తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ 2024

TG Lawcet Counselling 2024: తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని ప్రవేశ పరీక్షల కౌన్సెలింగ్ షెడ్యూల్స్ వచ్చేశాయి. అడ్మిషన్ల ప్రక్రియ కూడా చివరికి చేరుకుంది. ఇక లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను కూడా ఖరారు చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది.

లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించాలంటే ఆయా కాలేజీలకు బార్ కౌన్సెల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇంకా ఈ అనుమతులు రాలేదు. జులై నెలఖారులోపు ఈ ప్రక్రియ పూర్తి అవుతోందని తెలుస్తోంది. ఇదే జరిగితే ఆగస్టు తొలి వారంలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

లాసెట్ కౌన్సెలింగ్ జాప్యంపై తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఉన్నత విద్యా మండలి, ఓయూ లాసెట్ కన్వీనర్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో ప్రతివాదులు కౌంటర్‌లు కూడా దాఖలు చేశారు.

నోటిఫికేషన్ ప్రకారమే పరీక్ష నిర్వహించామని, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని లాసెట్ కన్వీనర్ కౌంటర్ పిటిషన్ లో తెలిపారు. కళాశాలలకు అనుమతి ఇచ్చే ప్రక్రియను ముగించడానికి ఆరు నెలల సమయం పడుతుందని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొంది. వేర్వేరు దాఖలైన పిటిషన్ల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం… తదుపరి విచారణను వాయిదా వేసింది.

అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. బీసీఐ అనుమతుల ప్రక్రియ పూర్తి అయితే… వెంటనే కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించే దిశగా కసరత్తు చేస్తోంది. అన్ని కుదిరితే ఆగస్టు 5 లేదా 7వ తేదీలోపు తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.

ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి….

ఈ ఏడాది జరిగిన టీఎస్ లాసెట్ పరీక్షకు 40,268 మంది హాజరయ్యారు. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు. మొత్తంగా 72.66 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

  • లాసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు మొదటగా https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
  • -గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.
  • అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు అత్యంత కీలకం.

2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) TS LAWCET/ TS PGLCET-2024 ను నిర్వహించింది. ఈ ఏడాదికి సంబంధించి జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలను నిర్వహించారు. ఉద‌యం 9 నుంచి 10.30 వ‌ర‌కు మొదటి సెషన్ జరిగింది. ఇక మ‌ధ్యాహ్నం 12.30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు రెండో సెషన్, సాయంత్రం 4 నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు మూడో సెషన్ పరీక్షను నిర్వహించారు. గతేడాదితో పోల్చితే ఈసారి లాసెట్ కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.

Whats_app_banner