TS Govt Advisors : తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకం - జాబితాలోని పేర్లు ఇవే-telangana government appointed government advisors ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt Advisors : తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకం - జాబితాలోని పేర్లు ఇవే

TS Govt Advisors : తెలంగాణ ప్రభుత్వ సలహాదారుల నియామకం - జాబితాలోని పేర్లు ఇవే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 21, 2024 08:44 AM IST

Telangana Govt Advisors: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ముగ్గురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించింది.

తెలంగాణ  ప్రభుత్వ సలహాదారులు
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు

Telangana Govt Advisors: ప్రభుత్వ సలహాదారులను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, హరకర వేణుగోపాల్ ను సలహాదారులుగా ప్రకటించింది. ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

yearly horoscope entry point

-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి నియామకం

-ఎస్సీ,ఎస్టీ,బిసీ,మైనార్టీ శాఖలకు సలహాదారుగా షబ్బీర్ అలీ

-రాష్ట్ర ప్రభుత్వ డిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా డా. మల్లు రవి

-ప్రోటోకాల్,ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా హర్కార వేణుగోపాల్ రావు నియామకం

ముఖ్యమంత్రి రేవంత్‌తో వేం నరేందర్‌ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇద్దరూ కలిసి పని చేశారు. 2004-2009 మధ్యలో వేం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2007లో ఎమ్మెల్సీగా రేవంత్‌రెడ్డి ఎన్నికయ్యారు. అప్పట్నుంచే ఇద్దరి మధ్య స్నేహం బలపడుతూ వచ్చింది. వేం నరేందర్ ను 2015లో ఎమ్మెల్సీగా గెలిపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అనంతర కాలంలో రేవంత్‌ రెడ్డి వెంటే ఉన్నారు నరేందర్ రెడ్డి. ఆ తర్వాత రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచీ పలు కార్యక్రమాల్లో వేం నరేందర్‌ క్రియాశీలకంగా ఉంటున్నారు. ఇటీవలి ఎన్నికల సమయంలోనూ పీసీసీ అధ్యక్షుడి ప్రచారంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో… వేం నరేందర్ కు ఛాన్స్ దక్కింది. ఇకపై ఆయన సీఎం రేవంత్ సలహాదారుడిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఇక మరో సీనియర్ నేత షబ్బీర్ అలీ కూడా సలహాదారుడిగా నియమితులయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కుతుందని అంతా భావించినప్పటికీ…. ఛాన్స్ దక్కలేదు. దీంతో ఆయన్ను సలహాదారునిగా నియమించింది. ఇక మల్లు రవిని ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది ప్రభుత్వం. ప్రోటోకాల్,ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారుగా హర్కార వేణుగోపాల్ రావు నియమితులయ్యారు. ఈ నియమకాలు వెంటనే అమల్లోకి వస్తాయని సీఎస్ పేర్కొన్నారు. ఈ నలుగురికి కేబినెట్ హోదాతో కూడిన ప్రొటోకాల్ అమలు కానుం

Whats_app_banner