D.Ed Hall Tickets : టీఎస్ డీఎడ్ సెకండియర్ హాల్ టికెట్లు విడుదల, ఈ నెల 25 నుంచి పరీక్షలు-telangana d ed second year hall tickets released exams start on september 25th ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Telangana D.ed Second Year Hall Tickets Released Exams Start On September 25th

D.Ed Hall Tickets : టీఎస్ డీఎడ్ సెకండియర్ హాల్ టికెట్లు విడుదల, ఈ నెల 25 నుంచి పరీక్షలు

Bandaru Satyaprasad HT Telugu
Sep 23, 2023 06:28 PM IST

D.Ed Hall Tickets : తెలంగాణ డీఎడ్ రెండో సంవత్సరం పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ డీఎడ్ పరీక్షలు జరుగనున్నాయి.

డీఎడ్ హాల్ టికెట్లు
డీఎడ్ హాల్ టికెట్లు

D.Ed Hall Tickets : తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(D.El.Ed) రెండో సంవత్సరం థియరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. డీఎడ్ రెండో సంవత్సరం పరీక్షలు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3 వరకు జరుగనున్నాయి. హాల్‌ టికెట్‌లను www.bse.talangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. తెలంగాణ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీ.ఎడ్‌) రెండో సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఒకరోజు ముందుగానే తమ పరీక్ష కేంద్రాలను చెక్ చేయాలని నిర్వాహకులు సూచించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 8.30 గంటలకే చేరుకోవాలని కోరారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్స్ అనుమతించమని తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్‌లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

జూనియల్ లెక్చరర్ హాల్ టికెట్లు విడుదల

జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో అప్డేట్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. పలు సబ్జెక్టుల రాత పరీక్ష హాల్ టికెట్లను కమిషన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులు https://www.tspsc.gov.in నుంచి హాల్‌ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఈ నెల 29న జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌, హిస్టరీ, సంస్కృతం అభ్యర్థులకు ఎగ్జామ్ ఉంది. అక్టోబర్‌ 3వ తేదీన జనరల్‌ స్టడీస్‌, జనరల్‌ ఎబిలిటీస్‌, ఉర్దూ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు… మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. జేఎల్ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 1,392 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

WhatsApp channel