SCR Special Trains : 174 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు - వివరాలివే-south central railway to run 174 additional special trains services during next three months ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains : 174 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు - వివరాలివే

SCR Special Trains : 174 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు - వివరాలివే

HT Telugu Desk HT Telugu
Oct 28, 2022 07:08 PM IST

south central railway special trains: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

174 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు
174 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు

South Central Railway Special Trains Latest: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ నుo పొడిగించింది.

రాబోయే మూడు నెలల్లో ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది దక్షిణ మధ్య రైల్వే. పలు ప్రాంతాల మధ్య ఇప్పటికే నడుపుతున్న 174 ప్రత్యేక రైళ్ల సర్వీసులను నవంబర్‌, డిసెంబర్‌, జనవరి మాసాల్లోనూ కొనసాగించనున్నట్టు పేర్కొంది.

3 నెలల పాటు సర్వీసులు అందించే ప్రత్యేక రైళ్ల వివరాలివే..

హైదరాబాద్ - నర్సాపూర్,

కాజీపేట్ - దాదర్,

సికింద్రాబాద్ - కాజీపేట్,

అగర్తాలా - సికింద్రాబాద్,

హైదరాబాద్ - జైపూర్,

జైపూర్ - హైదరాబాద్,

విశాఖపట్నం - సికింద్రాబాద్,

హైదరాబాద్ - గోరఖ్ పూర్,

విశాఖపట్నం- మహబూబ్ నగర్,

తిరుపతి - విశాఖపట్నం,

భువనేశ్వర్ - తిరుపతి,

విశాఖపట్నం- బెంగళూరు,

కాచిగూడ - మధురై

ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు…

tirupati secunderabad special trains: తిరుపతి - సికింద్రాబాద్ మద్య అక్టోబర్ 30వ తేదీన రాత్రి 07.50 నిమిషాలకు ప్రత్యేక రైలు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 08.50 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఇక సికింద్రాబాద్ నుంచి అక్టోబర్ 31 న తిరుపతి బయల్దేరుతుంది. ఇది రాత్రి 07.5 నిమిషాలకు బయల్దేరి... మరునాడు ఉదయం 08.10 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది.

ఈ ట్రైన్ రేణిగుంట, గుడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడస మదీరా, ఖమ్మం, డోర్నకల్, వరంగల్, కాజీపేట్, జనగాం స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.

ఇక కాచిగూడ - యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ అక్టోబర్ 30వ తేదీన రాత్రి 10.30 నిమిషాలకు కాచిగూడ నుంచి బయల్దేరి.. మరునాడు ఉదయం 10.50 నిమిషాలకు యశ్వంతపూర్ కు చేరుతుంది. ఇక యశ్వంతపూర్ నుంచి కాచిగూడకు అక్టోబర్ 31వ తేదీన రైలు వెళ్తుంది. ఇది మధ్యాహ్నం 03. 50 నిమిషాలకు బయల్దేరి... మరునాడు ఉదయం 4 గంటలకు కాచిగూడ చేరుతుంది.

ఈ ట్రైన్ షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, ఢోన్, అనంతపూర్, ధర్మవరం, హిందూపూర్, ఎల్హాంక స్టేషన్లలో ఆగుతుంది.

మరోవైపు కాచిగూడ - పూరీ మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. ఈట్రైన్ ఈనెల 28వ తేదీన కాచిగూడ నుంచి రాత్రి 08.45 నిమిషాలకు బయల్దేరుతుంది. తిరిగి మరునాడు సాయంత్రం 05.30 నిమిషాలకు పూరీ చేరుకుంటుంది. ఇక పూరీ నుంచి అక్టోబర్ 29న ప్రత్యేక రైలు రాత్రి 10.45 నిమిషాలకు బయల్దేరుతుంది. ఇది మరునాడు రాత్రి 08.45 నిమిషాలకు కాచిగూడకు చేరుతుంది.

ఈ ట్రైన్ మల్కాజ్ గారి, కాజీపేట్, వరంగల్, డోర్నకల్, ఖమ్మం, మధీరా, ఏలూరు, సామల్ కోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం, పలాస స్టేషన్లలో ఆగుతుంది.

సికింద్రాబాద్ - సంత్రగాచి మధ్య ఈ నెల 28వ తేదీన ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ రైలు ఉదయం 08.40 నిమిషాలకు బయల్దేరి... మరునాడు 10.25 నిమిషాలకు సంత్రగాచికి చేరుతుంది. ఇక సంత్రగాచి నుంచి అక్టోబర్ 29వ తేదీన సాయంత్రం 05.15 నిమిషాలకు ప్రత్యేక రైలు బయల్దేరుతుంది. ఇది మరునాడు రాత్రి 09.30 నిమిషాలకు సికింద్రాబాద్ స్టేషన్ చేరుతుంది.

ఈ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, నడికుడ,గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్ కోట్, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖుర్దా, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలసోర్, ఖరగ్ పూర్ స్టేషన్లలో ఆగుతుంది.

IPL_Entry_Point