Singareni Elections: సింగరేణిలో కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభం
Singareni Elections: సింగరేణిలో పోలింగ్ ప్రారంభంమైంది. హైకోర్టు ఆదేశాలతో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Singareni Elections: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలోని సగం జిల్లాల్లో సింగరేణి కార్మికసంఘం ఎన్నికలు ప్రభావం ఉండటంతో ప్రధాన పార్టీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత బిఆర్‌ఎస్ పార్టీ కార్మిక సంఘం ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది.
సింగరేణిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరామ్‌పూర్, మంచిర్యాల, రామగుండం ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఐదు గంటల తర్వాత కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికలు జరిగిన కేంద్రాలలో ఏర్పాట్లు చేశారు. రాత్రి 11గంటలకు ఎన్నికల ఫలితాలు వెలువడతాయని అంచనా వేస్తున్నారు.
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మొత్తం 13సంఘాల పోటీలో ఉన్నాయి. ఎన్నికల్లో గుర్తింపు సంఘం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ అందరిలో ఉంది. మూడు సంఘాల మధ్య ప్రధాన పోటీ ఉంది. కాంగ్రెస్ అనుబంధంగా ఉన్న యూనియన్ తరపున ఆ పార్టీ ఎమ్మెల్యేలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు.సింగరేణిలో పాగా వేయాలని కాంగ్రెస పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీ కూడా ఎన్నికలకు ముందు సింగరేణి ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించారు.
మంచిర్యాల, రామగుండంలో మెజార్టీ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఐఎన్‌టియుసి, ఏఐటియుసి మధ్య పోటీ ఉంది. ఎన్నికల్లో గెలిపిస్తే కార్మికులఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ అనుబంధం సంఘం ప్రచారం చేసింది. కార్మికుల పక్షాన పోరాడేది తామేనని ఏఐటియుసి చెబుతూ వచ్చింది. దీంతో ఎవరికి కార్మికులు పట్టం కడతారనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు సింగరేణిలో ఉన్న 18వేల యువ ఓటర్లు కీలకంగా మారారు. ఫలితాలను వారు నిర్ణయించనున్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్‌లో కార్మికులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏడేళ్ల క్రితం చివరి సారి సింగరేణి ఎన్నికలు ఏడేళ్ల క్రితం నిర్వహించారు. ఆరు జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో బ్యాలెట్ పద్ధతిలో తాజా ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగ నున్నది.
రాత్రి 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి. 11 ఏరియాల పరిధిలో 39,827 మంది కార్మికులు ఓటు వేయనున్నారు.