Singareni Recruitment 2024 : సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల - మార్చి 1 నుంచి దరఖాస్తులు-singareni external recruitment notification released for 272 posts check the details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Singareni Recruitment 2024 : సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల - మార్చి 1 నుంచి దరఖాస్తులు

Singareni Recruitment 2024 : సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల - మార్చి 1 నుంచి దరఖాస్తులు

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 23, 2024 01:35 PM IST

Singareni Recruitment 2024 Updates: 272 ఉద్యోగాల భర్తీకి సింగరేణి సంస్థ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ముఖ్య వివరాలను వెల్లడించారు. మార్చి 1వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

సింగరేణిలో ఉద్యోగాలు 2024
సింగరేణిలో ఉద్యోగాలు 2024 (https://scclmines.com/)

Singareni Recruitment 2024 Updates: సింగరేణి సంస్థ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో 272 పోస్టుల భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మైనింగ్‌) పోస్టులు 139గాఉన్నాయి. మార్చి 1వ తేదీ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://scclmines.com/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు.

ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన - సింగరేణి సంస్థ

ఖాళీలు - 272

ఖాళీల వివరాలు - ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మైనింగ్‌) పోస్టులు 139, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఐఈ) - 10, జూనియర్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ -10, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హైడ్రో–జియాలజిస్ట్‌) - 02, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌) -18, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఏ) - 22, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (పర్సనల్‌) - 22, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ - 3, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ - 30 ఉన్నాయన్నారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో సబ్‌ ఓవర్సీస్‌ ట్రైనీ (సివిల్‌) - 16.

వయోపరిమితి - వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించారు.( ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి మినహాయింపు ఇచ్చారు.)

పూర్తి స్థాయి నోటిఫికేషన్ ను మార్చి 1వ తేదీన వెబ్ సైట్ లో ఉంచుతారు.

దరఖాస్తులు - ఆన్ లైన్ విధానం

దరఖాస్తులు ప్రారంభం - మార్చి 1, 2024.

దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - మార్చి 18, 2024.

అధికారిక వెబ్ సైట్ - . https://scclmines.com/

అగ్నివీర్​ రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్ విడుదల

Secunderabad Agniveer Recruitment Rally 2024: సికింద్రాబాద్ లోని ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ 'అగ్నిపథ్' స్కీమ్ కింద 2024-25 సంవత్సరానికి సంబంధించి అగ్నివీరుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 13వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా…దరఖాస్తుల సమర్పణకు మార్చి 22 వరకు గడువు విధించారు. ఏప్రిల్ 22వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఎంపికైనవారు ఇండియన్ ఆర్మీలో నాలుగేళ్ల కాలానికి అగ్నివీరులుగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి…

ముఖ్య వివరాలు:

రిక్రూట్ మెంట్ ప్రకటన - ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, సికింద్రాబాద్ .

పోస్టులు -అగ్నిపథ్'స్కీమ్ లో భాగంగా అగ్నీవీరుల నియామకం.

పోస్టులు - అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్, అగ్నివేర్ ట్రేడ్స్ మ్యాన్.

అర్హతలు -అగ్నివీర్ జనరల్ డ్యూటీ పోస్టుకు కనీసం పదో తరగతిలో 45 మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. టెక్నికల్ పోస్టుకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఐటీఐ కూడా ఉండాలి. ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు చూస్తే..60 శాతం మార్కులతో ఇంటర్ పాసై ఉండాలి. ట్రేడ్స్ మ్యాన్ కు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి- 17.5 - 21 సంవత్సరాల మధ్య ఉండాలి.

శారీరక ప్రమాణాలు - ఎత్తు 166 సెం.మీ ఉండాలి. కొన్ని పోస్టులకు 162 సెం.మీ ఉన్నా సరిపోతుంది. గాలిపీల్చినప్పుడు ఛాతి సెం.మీ పెరగాలి. ఎత్తుకు తగినంత బరువు కూడా కలిగి ఉండాలి.

దరఖాస్తులు - ఆన్ లైన్

దరఖాస్తు రుసుం - రూ.250.

దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 13, 2024.

దరఖాస్తుల స్వీకరణ తుది గడువు - మార్చి 22, 2024.

ఎంపిక విధానం- ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. రిక్రూట్‌మెంట్ ర్యాలీ(ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌/ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌), వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు- అగ్నివీరులాగ ఎంపికైనవారు నాలుగేళ్లు ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం నెలకు రూ.30,000, రెండో సంవత్సరం నెలకు రూ.33,000 చెల్లిస్తారు. మూడో సంవత్సరం నెలకు రూ.36,000, నాలుగో సంవత్సరం నెలకు రూ.40,000 చొప్పున చెల్లిస్తారు.

ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం - 22. ఏప్రిల్ 2024.

అధికారిక వెబ్ సైట్ - https://joinindianarmy.nic.in

WhatsApp channel