Rowdy Sheeter Murder: హైదరాబాద్‌లో కాల్పులు..బాలాపూర్‌లో రౌడీ షీటర్ రియాజ్ దారుణ హత్య-shooting in hyderabad rowdy sheeter riaz brutally murdered in balapur ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rowdy Sheeter Murder: హైదరాబాద్‌లో కాల్పులు..బాలాపూర్‌లో రౌడీ షీటర్ రియాజ్ దారుణ హత్య

Rowdy Sheeter Murder: హైదరాబాద్‌లో కాల్పులు..బాలాపూర్‌లో రౌడీ షీటర్ రియాజ్ దారుణ హత్య

Sarath chandra.B HT Telugu
Aug 09, 2024 08:17 AM IST

Rowdy Sheeter Murder: హైదరాబాద్‌లో కాల్పులు కలకలం రేపాయి. బాలాపూర్‌లో రౌడీ షీటర్ రియాజ్‌ను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు.

హైదరాబాద్‌లో కాల్పులు, రౌడీ షీటర్ కాల్చివేత
హైదరాబాద్‌లో కాల్పులు, రౌడీ షీటర్ కాల్చివేత

Rowdy Sheeter Murder: హైదరాబాద్‌లో కాల్పులు కలకలం రేపాయి. రౌడీషీటర్‌ రియాజ్ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన పలు నేరాల్లో మృతుడు నిందితుడిగా ఉన్నారు. మీర్‌ పేట్ లో నివాసం ఉంటున్నరియాజ్‌ బైక్‌పై వెళుతుండగా ప్రత్యర్థులు తుపాకులతో కాల్పులు జరిపారు.

రాచకొండ కమిషనరేట్,బాలాపూర్ పోలీస్ స్టేషన్ కంచన్ భాగ్ కు చెందిన రియాజ్ రౌడీషీటర్ దారుణ హత్యకు గుర్యాడు. గుర్తు తెలియని దుండగులు కాపుకాచి తుపాకులతో కాల్పులు జరిపారు. సంఘటన స్థలం చేరుకున్న బాలాపూర్ పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

మృతుడు రియాజ్ బాబా నగర్ C బ్లాక్‌లో నివాసం ఉంటున్నాడు. బాలాపూర్ ఎన్నార్సీఐ రోడ్డులో అర్థరాత్రి ప్రత్యర్థులు కాల్పులు జరిపి రౌడి షీటర్ దారుణ హత్య చేశారు. ఘటనా స్థలంలో బుల్లెట్ షెల్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన రాచకొండ సి పి సుధీర్ బాబు,మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి, వెస్ట్ జోన్ అడిషనల్ డిసిపి షేక్ జహంగీర్ పరిశీలించారు. మృతుడు ఖాజా రియాజుద్దీన్ ఫ్రూట్‌ మర్చంట్ వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై పలు కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు. ప్రత్యర్థులు కారులో వచ్చి హత్యకు పాల్పడినట్టు తెలిపారు.

ఫజల్ పలు హత్య కేసులలో నిందితుడిగా ఉన్నారని సీపీ తెలిపారు. టెక్నికల్ టీమ్స్‌, ఎస్వోటీ టీమ్స్‌కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాలాపూర్‌ స్టేషన్‌తో పాటు పాతబస్తీలో కేసులు ఉన్నాయని, మీర్‌పేట్ పిఎస్‌ లిమిట్స్‌ పరిధిలో నివాసం ఉంటున్నట్టు తెలిపారు.