YS Sharmila Phone Call : రేవంత్, బండి సంజయ్ కి షర్మిల ఫోన్... తెరపైకి కొత్త ప్రతిపాదన
Y S Sharmila Latest News: రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కు ఫోన్ చేశారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని కోరారు.
Y S Sharmila calls Revanth Reddy and Bandi Sanjay: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని కోరారు. ఉమ్మడి కార్యాచారణ చేద్దామని ప్రతిపాదించారు. ప్రగతి భవన్ మార్చ్ కు పిలుపునిద్దామని షర్మిల సూచించారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ బతకనియ్యడని అన్నారు. షర్మిలకు మద్దతు తెలిపిన బండి సంజయ్ త్వరలో సమావేశమవుదామని చెప్పారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడగా.... తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ఇక శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ను ముట్టడికి యత్నించిన వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కార్యాలయం గేటు ముందు రోడ్డుపై బైఠాయించి పేపర్ లీక్ వ్యవహారంపై నిరసన తెలిపారు షర్మిల. అప్రమత్తమైన పోలీసులు షర్మిలతో పాటు ఆ పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
బలవంతంగా వైఎస్ షర్మిల పోలీస్ వాహనంలోకి ఎక్కించారు. ఈ సందర్భంగా పేపర్ లీకేజీపై షర్మిల స్పందించారు. పేపర్ లీక్ కేసులో పెద్దవాళ్లను తప్పిస్తున్నారని ఆరోపించారు. ఆందోళన అనగానే హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారని, తనకు లుకౌట్ నోటీసులు ఇచ్చారని... లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి తానేమన్నా క్రిమినల్‌నా? అంటూ షర్మిల ప్రశ్నించారు. తన ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారని, ప్రజాస్వామ్యపరంగా నిరసనలు చేయనీయకుండా గొంతు నొక్కేస్తున్నారని విమర్శించారు. అరెస్టులపై షర్మిల ట్విట్టర్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. "నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న నాపై లుక్ ఔట్ నోటీసులు ఇవ్వడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనం. ఇప్పటికే రెండుసార్లు హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు దుర్మార్గంగా లుక్ ఔట్ నోటీసులు ఇచ్చి, పోలీసులను ఉసిగొల్పుతున్నారు. TSPSC ప్రశ్నాపత్రాల కుంభకోణంలో SIT పెద్ద తలకాయలను వదిలేస్తోంది' అంటూ ఘాటుగా మాట్లాడారు.
సంబంధిత కథనం