Bonus for Singareni Employees: సింగ‌రేణి ఉద్యోగుల‌కు తీపికబురు.. 30 శాతం బోనస్-sccl announced profit and dasara bonus for singareni employees ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bonus For Singareni Employees: సింగ‌రేణి ఉద్యోగుల‌కు తీపికబురు.. 30 శాతం బోనస్

Bonus for Singareni Employees: సింగ‌రేణి ఉద్యోగుల‌కు తీపికబురు.. 30 శాతం బోనస్

HT Telugu Desk HT Telugu
Sep 28, 2022 03:19 PM IST

good news for singareni employees: సింగ‌రేణి ఉద్యోగుల‌కు తెలంగాణ ప్రభుత్వం ద‌స‌రా కానుక ప్ర‌క‌టించింది. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు.

<p>సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్</p>
సింగరేణి ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ (twitter)

dasara bonus for singareni employees: సింగ‌రేణి ఉద్యోగుల‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీపికబురు చెప్పారు. ద‌స‌రా కానుక ప్ర‌క‌టించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఇవ్వాల‌ని నిర్ణయించారు. పండుగ లోపు ఈ వాటాను ఉద్యోగుల‌కు చెల్లించాల‌ని ఆదేశించారు.

bonus for singareni employees: సింగరేణి కాలరీస్ సంస్థ, 2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను, సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందించాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సింగరేణి కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు వెంటనే చెల్లించాల్సిందిగా, సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా, అర్హులైన కార్మికులకు రూ. 368 కోట్లు సింగరేణి సంస్థ చెల్లించనున్నది. గతేడాది లాభాల్లో కార్మికులకు యాజమాన్యం 29శాతం వాటా అందజేసింది.

2021–22 ఆర్థిక సంవత్సరానికి సింగరేణి కాలరీస్ కంపెనీ దాదాపు రూ. 1200 కోట్లకు పైగా లాభాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగడంతో వాస్తవ లాభాలు ఎక్కవగా ఉన్నాయి. 2021-–22 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికే సుమారు రూ.650 కోట్ల లాభాలను సంస్థ ఆర్జించింది. కొద్దిరోజులుగా దేశంలో బొగ్గు కొరత ఏర్పడటంతో సింగరేణి బొగ్గు దేశవ్యాప్తంగా వేగంగా అమ్ముడుపోయింది. ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పవర్​ ప్రాజెక్టులకు అవిశ్రాంతంగా బొగ్గు సప్లై చేసింది. దీంతో డిసెంబర్​నాటికి అమ్మకాలు భారీగానే ఉన్నట్లు సమాచారం.

Whats_app_banner