TSPSC Group 3 Applications : గ్రూప్ 3 దరఖాస్తులు ప్రారంభం - జోన్లవారీగా పోస్టులివే
TSPSC Group 3 Recruitment:గ్రూప్-3 పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మరోవైపు పోస్టుల వివరాలను కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది.
TSPSC Group 3 Recruitment 2023: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి వరుస నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇటీవల... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1,365 పోస్టులతో గ్రూప్ - 3 నోటిఫికేషన్ జారీ అయింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే సిలబస్ లోని అంశాలు, పరీక్ష విధానానికి సంబంధించిన వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవే గాకుండా తాజాగా... జోన్లవారీగా పోస్టుల వివరాలను కూడా ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.
దరఖాస్తు ఇలా చేసుకోండి..
ఓటీఆర్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
ఓటీఆర్ పూర్తి చేసిన అభ్యర్థులు మొదటగా టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ సైట్ లోకి వెళ్లండి.
https://group3appl2546825.tspsc.gov.in/CandidateEntry292022 అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
TSPSC ID , పుట్టిన తేదీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది.
ఓటీఆర్ లో ఇచ్చిన వివరాలు నమోదు వెబ్ సైట్ లో అందుబాటులో ఉండటంతో.. మిగతా ప్రాసెస్ సులభంగా పూర్తి అవుతుంది.
మీ విద్యార్హతలను బట్టి కొన్ని ప్రత్యేక పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుంది. కాబట్టి విద్యార్హతలతో పాటు పోస్టులను క్లియర్ గా చూడాలి.
జోనల్ వారీగా పోస్టుల ఖాళీలను కింద ఇచ్చిన పీడీఎఫ్ లో చెక్ చేసుకోవచ్చు.
మొత్తం 3 పేపర్లు, 450 మార్కులు..
గ్రూప్ 3 పరీక్షలో మొత్తంగా మూడు పేపర్లు ఉండనున్నాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. బుధవారం ఈ సిలబస్ ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది టీఎస్పీఎస్సీ. గ్రూప్-3 పోస్టులకు పోటీపడే అభ్యర్థులు మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.
గ్రూప్ 3లోని మొదటి పేపర్ లో జనరల్ నాల్జెడ్ కి సంబంధించి ఉంటుంది. ఇక పేపర్-2లో మొత్తం 3 అంశాలు ఉండగా.. ప్రతి అంశంపై 50 ప్రశ్నలు.. 50 మార్కులు ఉంటాయి. ఇదే పేపర్‌లో భారత రాజ్యాంగం అంశానికి 50 మార్కులు, భారత చరిత్రకు మరో 50 మార్కులు ఇచ్చారు. తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశానికి 50 మార్కులు ఉంటాయి. పేపర్-3లో మూడు అంశాలుండగా.. ఒక్కో అంశానికి 50 మార్కులున్నాయి. వీటిలో భారత ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో మార్పులు వంటి అంశాలున్నాయి. గ్రూప్ 3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు.