చంచల్​గూడ జైలుకు రాహుల్​ గాంధీ.. వారితో 'ములాఖాత్​'-rahul gandhi telangana tour congress leader visits chanchalguda jail ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  చంచల్​గూడ జైలుకు రాహుల్​ గాంధీ.. వారితో 'ములాఖాత్​'

చంచల్​గూడ జైలుకు రాహుల్​ గాంధీ.. వారితో 'ములాఖాత్​'

HT Telugu Desk HT Telugu
May 07, 2022 02:08 PM IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. చంచల్​గూడ జైలుకు వెళ్లి ఎన్​ఎస్​ఈయూఐ కార్యకర్తలతో ములాఖాత్​ నిర్వహించారు. అంతకుముందు సంజీవయ్య పార్కుకు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి సంజీవయ్య సమాధికి నివాళులర్పించారు.

<p>సంజీవయ్య పార్కులో రాహుల్​ గాంధీ.. ఇతర కాంగ్రెస్​ నేతలు</p>
సంజీవయ్య పార్కులో రాహుల్​ గాంధీ.. ఇతర కాంగ్రెస్​ నేతలు (HT Telugu)

Rahul Gandhi Telangana tour | తెలంగాణాలో.. రెండో రోజు పర్యటనలో భాగంగా.. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.. చంచల్​గూడ జైలుకు వెళ్లారు. అక్కడ ఉన్న ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలతో ములాఖాత్​ నిర్వహించారు. ఆయన వెంట సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాణిక్యం ఠాకూర్​ సైతం ఉన్నారు.

ఓయూలో రాహుల్​ గాంధీ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్​ ప్రయత్నించింది. కానీ అందుకు అనుమతులు లభించలేదు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వారిని పోలీసులు అరెస్ట్​ చేశారు. తాజాగా.. శనివారం వారితో ములాఖా​త్​ నిర్వహించారు రాహుల్​.

మధ్యాహ్నం 1:05-1:30 గంటల మధ్య ములాఖాత్​ నిర్వహించేందుకు పోలీసులు రాహుల్​ గాంధీకి అనుమతినిచ్చారు. కానీ షెడ్యూల్​ ఆలస్యమవ్వడంతో ఆయన 1:20గంటలకు చంచల్​గూడకు చేరుకున్నారు. కాగా.. లోపలికి ముగ్గురికే అనుమతులివ్వడంతో.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ సహా పలువురు సీనియర్​ నేతలు జైలు బయటే ఉండిపోయారు. దాదాపు 20 నిమిషాలపై రాహుల్​ గాంధీ ములాఖాత్​ జరిగింది.

కాగా.. అరెస్టైన 18మంది విద్యార్థులతో రాహుల్​ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఓయూలో పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. నిరుద్యోగ సమస్యలపై మాట్లాడినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి.

చంచల్​గూడ జైలులో ములాఖాత్​ అనంతరం పార్టీ కార్యలయానికి రాహుల్​ గాంధీ వెళ్లనున్నారు. కాంగ్రెస్​ నేతలతో పాటు విద్యార్థి సంఘాలతో ఆయన మాట్లాడనున్నట్టు సమాచారం.

సంజీవయ్య పార్కులో..

అంతకుముందు.. శనివారం ఉదయం తాజ్​ కృష్ణ హోటల్​ నుంచి సంజీవయ్య పార్కుకు వెళ్లారు కాంగ్రెస్​ అగ్రనేత. మాజీ సీఎం దామోదరం సంజీవయ్య సమాధికి నివాళలర్పించారు. కాంగ్రెస్​ అగ్రనేత. కొద్దిసేపు అక్కడే కూర్చుని, సంజీవయ్య సేవలను స్మరించుకున్నారు. టీపీసీసీలోని పలువురు సీనియర్​ నేతలు రాహుల్​ గాంధీ వెన్నంటే ఉన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం