World Cup Matches at Uppal : ఉప్పల్ వేదికగా క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‍లు - 1500 మందితో భారీ పోలీస్ బందోబస్తు-rachakonda police deploys 1500 cops an 360 cctv cameras at uppal stadium over icc world cup 2023 matches ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  World Cup Matches At Uppal : ఉప్పల్ వేదికగా క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‍లు - 1500 మందితో భారీ పోలీస్ బందోబస్తు

World Cup Matches at Uppal : ఉప్పల్ వేదికగా క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్‍లు - 1500 మందితో భారీ పోలీస్ బందోబస్తు

HT Telugu Desk HT Telugu
Oct 05, 2023 05:30 PM IST

Rachakonda Police Latest News : ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం నుంచి క్రికెట్ ప్రపంచ కప్ సందడి మొదలుకానుంది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ డీఎస్‌ చౌహాన్‌ వెల్లడించారు.

ఉప్పల్ స్టేడియంలో రాచకొండ సీపీ
ఉప్పల్ స్టేడియంలో రాచకొండ సీపీ

CC World Cup 2023 matches at Uppal Stadium: హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం లో రేపటి నుంచి ప్రపంచ కప్ సందడి మొదలు కానుంది.ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు.స్టేడియం లోపల బయట 1,500 మంది పోలీసులు, 360 సీసీ కెమెరాలతో భారీ భద్రతా ఏర్పాట్లు కు సిద్ధమయ్యారు.చేశారు. ట్రాఫిక్, శాంతిభద్రతల తో సహా ఆటగాళ్లు మరియు ప్రేక్షకుల భద్రత కోసం వివిధ విభాగాలతో రాచకొండ పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ గురువారం తెలిపారు.

భారీ బందోబస్తు - రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌

గురువారం మీడియాతో రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ మాట్లాడుతూ… మ్యాచ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో క్రికెట్‌ మ్యాచ్‌లు సజావుగా సాగేందుకు మునుపెన్నడూ లేని విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. సుమారు 39,000 సీట్లు సీటింగ్ కెపాసిటీ గల ఈ స్టేడియం అంతటా 1,500 మంది పోలీసు అధికారులను మోహరించడం తో పాటు, వాహన తనిఖీ కేంద్రాల వద్ద స్థలాలు, పార్కింగ్ స్థలాలు సహా మొత్తం 360 సీసీటీవీ కెమెరాలను స్టేడియం మరియు చుట్టుపక్కల ప్రాంతాన్ని కవర్ చేయడానికి ఏర్పాటు చేశామన్నారు. ప్రేక్షకులు వారి టిక్కెట్ల ఆధారంగా గేట్ల ద్వారా అనుమతిస్తారన్నారు.గేట్ నెంబర్ 1 ద్వారా ప్రవేశం కేవలం ఆటగాళ్లకు మాత్రమే పరిమితం చేయబడుతుందని వేరెవ్వరికి గెట్ నెంబర్ 1 నుండి అనుమతి ఉండదని చౌహాన్ స్పష్టం చేశారు. భద్రత, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, AR ఫోర్స్, SOT, CCS, షీ టీమ్, మౌంటెడ్ పోలీస్, వజ్ర, ఫైర్ టెండర్లు మరియు ఫైర్ డిపార్ట్‌మెంట్‌తో సహా ఆటగాళ్లు మరియు ప్రేక్షకుల భద్రత కోసం వివిధ విభాగాలతో భారీ బందోబస్తు ఏర్పాట్లు సమన్వయం చేయబడ్డాయని డిఎస్ చౌహాన్ తెలిపారు.

CCTV ఫుటేజీని పర్యవేక్షించడానికి మరియు తక్షణ చర్య తీసుకోవడానికి దక్షిణం వైపున ఉన్న G-6 బాక్స్ వద్ద జాయింట్ కమాండ్ మరియు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.B.D టీమ్‌ల సహాయంతో విధ్వంస నిరోధక తనిఖీలు మ్యాచ్ ముగిసే వరకు రౌండ్ ది క్లాక్ నిర్వహించబడతాయన్నారు. ప్రతి సబ్-ఇన్‌స్పెక్టర్ మరియు అంతకంటే ఎక్కువ ర్యాంక్‌కు VHF సెట్‌ల కేటాయించమన్నారు.అలాగే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ నిర్వహించబడుతుందన్నారు.స్టేడియం మరియు పార్కింగ్ ప్రదేశాలలో భద్రతను నిర్ధారించడానికి బాంబు నిర్వీర్య బృందం మరియు స్నిఫర్ డాగ్‌లను రంగంలోకి ధింపుతామని చౌహాన్ స్పష్టం చేశారు.స్టేడియంలోని అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద యాంటీ విధ్వంసక తనిఖీలు, ఫ్రిస్కింగ్‌లు చేసేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు.ప్రతి గేటు వద్ద ప్రేక్షకుల మొబైల్ ఫోన్‌లను గుర్తించేందుకు ముగ్గురు మొబైల్ టెక్నీషియన్‌లతో సంఘవిద్రోహ ఎలిమెంట్స్ కదలికలను పర్యవేక్షించేందుకు బృందాలను నియమించమన్నారు.స్టేడియం మరియు చుట్టుపక్కల సమర్థవంతమైన బందోబస్త్ ఉండేలా గేట్ నంబర్-1, 3, 4, 7, & 8 వద్ద పోలీసు బలగాలను మోహరించారాని చౌహాన్ వెల్లడించారు. వీక్షకులు నిషేధిత వస్తువులైన దీపాలు, బ్యానర్లు, వాటర్ బాటిళ్లు, కెమెరాలు, సిగరెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అగ్గిపెట్టెలు, లైటర్లు, బైనాక్యులర్లు, నాణేలు, రైటింగ్ పెన్నులు, బ్యాటరీలు, హెల్మెట్‌లు, పెర్ఫ్యూమ్‌లు, బ్యాగులు మరియు బయటి ఆహార పదార్థాలను తీసుకెళ్లడం నిషేధించబడుతాయన్నారు.

అధికారులు నిర్దేశించిన ధరలను అనుసరించి మహిళలు మరియు విక్రయదారులపై ఈవ్ టీజింగ్‌లను నియంత్రించేందుకు షీ టీమ్‌లు మరియు విజిలెన్స్ బృందాలను నియమించారాని పేర్కొన్నారు రాచకొండ సీపీ చౌహాన్. వీక్షకులు జెన్‌పాక్ట్ నుండి ఉప్పల్ రింగ్ రోడ్ మరియు ఉప్పల్ రింగ్ రోడ్ నుండి విశాల్ మార్ట్, రామంతపూర్ వరకు మరియు నిర్దేశించిన TSIIC పార్కింగ్ ప్రాంతాలలో మాత్రమే వాహనాలను పార్కింగ్ చేయడానికి అనుమతి లేదన్నారు.ప్రేక్షకులను మధ్యాహ్నం 12 గంటల లోపే స్టేడియం లోకి అనుమతీస్తారన్నారు.ప్రేక్షకుల భద్రత కోసం, తక్షణ వైద్య సేవలు అందించేందుకు 7 అత్యవసర అంబులెన్స్ లను కూడా అందుబాటులో ఉంచుతునట్లు వివరించారు.

రిపోర్టర్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

Whats_app_banner