Prof Kodandaram: లెండి ప్రాజెక్టును కెసిఆర్ విస్మరించారన్న ప్రొఫెసర్ కోదండరాం-professor kodandaram said that kcr has ignored the lendi project ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Prof Kodandaram: లెండి ప్రాజెక్టును కెసిఆర్ విస్మరించారన్న ప్రొఫెసర్ కోదండరాం

Prof Kodandaram: లెండి ప్రాజెక్టును కెసిఆర్ విస్మరించారన్న ప్రొఫెసర్ కోదండరాం

HT Telugu Desk HT Telugu
Jan 24, 2024 07:24 AM IST

Prof Kodandaram: కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంతరాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి ప్రాజెక్టును పూర్తిగా విస్మరించారని జన సమితి అధినేత, ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు.

లెండి ప్రాజెక్టు పరిశీలిస్తున్న కోదండరాం
లెండి ప్రాజెక్టు పరిశీలిస్తున్న కోదండరాం

Prof Kodandaram: అంతరాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి ప్రాజెక్టు పూర్తయితే మహారాష్ట్ర, తెలంగాణ రైతులకు ప్రయోజనం కలుగుతుందని ప్రొఫెసర్‌ కోదండరాం చెప్పారు.

మంగళవారం ప్రొఫెసర్ కోదండరాం లెండి ప్రాజెక్టును సందర్శించారు. లెండి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రిని కోరుతానని అన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. 1984వ సంవత్సరంలో లెండి ప్రాజెక్టు పనులు ప్రారంభించినప్పటికీ.... ఇప్పటికీ ప్రాజెక్టు పనులు పూర్తికాలేదని అన్నారు.

1987లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్.బి చౌహన్, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు ఒప్పందంతో పనులు ప్రారంభించారని వివరించారు.భూములు కోల్పోయిన రైతులు పరిహారం చెల్లించాలని కోరడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణానికి మొగ్గు చూపడం లేదని వివరించారు.

2003లో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో నూతన అంచనా వ్యయాలపై ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర 62 శాతం, ఉమ్మడి రాష్ట్రం 38 శాతం నిధులు ఖర్చులు చేయాలని ఒప్పందం జరిగిందని వివరించారు.

ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం 14 గేట్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం ఎనిమిది గేట్లు మాత్రమే నిర్మించారని తెలిపారు. ఇప్పటికీ నాలుగేట్లు నిర్మాణం జరగలేదని తెలిపారు. కాలువలది కూడా అదే పరిస్థితిని అన్నారు.

ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే జుక్కల్ పరిధిలోని బిచ్కుంద, మద్నూర్ లో రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు. కానీ మహారాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు పనులు ముందుకు సాగలేదని వాపోయారు. తెలంగాణ ప్రభుత్వంలో మేము కూడా మిత్ర పక్షంగా ఉన్నాం అందుకే ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి లెండి ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యేవిదంగా కృషి చేస్తామని కోదండరాం చెప్పారు

(మీసా భాస్కర్,ht నిజామాబాద్)

IPL_Entry_Point