Medak Murder: వీడిన మహిళ హత్య మిస్టరీ.. తాగుబోతే హంతకుడు-police have identified the accused in medak womans murder case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Murder: వీడిన మహిళ హత్య మిస్టరీ.. తాగుబోతే హంతకుడు

Medak Murder: వీడిన మహిళ హత్య మిస్టరీ.. తాగుబోతే హంతకుడు

HT Telugu Desk HT Telugu
Feb 01, 2024 06:27 AM IST

Medak Murder: అప్పుల పాలైన తాగుబోతు సిద్ధిపేట జిల్లా కొల్గురులో మహిళను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

కొల్గురు వృద్ధురాలి హత్య కేసులో వీడిన మిస్టరీ
కొల్గురు వృద్ధురాలి హత్య కేసులో వీడిన మిస్టరీ

Medak Murder: కొల్గురులో గత వారం హత్యకు గురైన మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. తాగుడుకు అలవాటు పడి, చేసిన అప్పులు తీర్చే మార్గం కనపడక, రోజు వెళ్లే కిరాణా షాప్ మహిళ ధరించిన నగలపై కన్నేసిన దుండగుడు హత్యకు పాల్పడినిట్టు గుర్తించారు.

yearly horoscope entry point

గజ్వేల్ మండలం కొల్గురు లో గత శుక్రవారం జరిగిన మహిళా చెన్న శ్యామల (52) హత్య కేసుని చేధించిన పోలీసులు, శ్యామల కిరాణా షాప్ లో సిగరెట్టు కొనడానికి వచ్చే తాగుబోతు సుంకరి భాను (30) నే హంతకుడుగా తేల్చారు.

గజ్వేల్ పట్టణంలోని పాతబస్తీలో నివాసం ఉండే భాను, ఇస్త్రీ షాప్ నడుపుకొని తన ముగ్గురు పిల్లలు, భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే తాగుడుకు అలవాటుపడిన భాను, పలువురి వద్ద అప్పులు చేశాడు. అప్పులు తీర్చ మార్గం కనపడక, కొత్తగా అప్పులు ఇచ్చేవారులేక, తాగుడుకు డబ్బులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు.

శ్యామల మెడలో ఆభరణాల పై కన్ను…

కొల్గురుకు ప్రతిరోజు కల్లు తాగడానికి వచ్చే భాను, కిరాణా షాప్ లో వృద్ధులైన శ్యామల ఆమె భర్త శ్రీనివాస్ మాత్రమే ఉండటం గమనించాడు. శ్యామల మేడలో బంగారు ఆభరణాలు ఉండటం గమనించి, ఎలాగైనా అవి దొంగిలించి తన అప్పులు తీర్చుకోవాలని పన్నాగం పన్నాడు.

ఈ క్రముంలో వారితో మాట మాట కలిపి వారి రోజు వారి దినచర్యలు తెలుసుకున్నాడు. వృద్ధురాలి ఒంటిపై నగలు ఉండటం చూసి ఎలాగైనా వాటిని దొంగిలింఛి అప్పులు తీర్చుకుని, చిట్టిపైసలు కట్టాలని అనుకున్నాడు.

పథకం ప్రకారం వారి ఇంట్లో చొరబడి కిరణా షాప్ కౌంటర్‌లో ఉన్న డబ్బులు దొంగిలించి ఆపై బాత్రూం నుండి హాలులో కి వస్తున్న వృద్ధురాలిని వెనుక నుండి నోరు మూసి కిందపడేసి ఆమెపై కూర్చొని పక్కన ఉన్న దిండుతో ముఖంపై బలంగా అదిమి పెట్టడంతో ఆందోళనకు గురైన వృద్ధురాలు బీపీ పెరిగి స్పృహ కోల్పోయింది. ఆమె చనిపోయింది అనుకుని ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకొని వెళ్ళినాడు.

స్పెషల్ టీం ను ఏర్పాటు చేసి...

గజ్వేల్ ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో స్పెషల్ టీం ను ఏర్పాటు చేసి కేసును చేధించారు. అధునాతన సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించి 31వ తేదీ బుధవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు ఇస్త్రీ షాపు పెట్టుకుని జీవించేవాడు. మద్యం, కల్లు తాగడానికి అలవాటుపడి ఇస్త్రీ షాప్ ద్వారా వచ్చిన డబ్బులు అవసరాలకు సరిపోక పనికోసం కొంతకాలం హైదరాబాద్, హనుమకొండలలో హోటల్ సప్లయిర్‌గా పనిచేశాడు.

2017లో పై నిందితునికి అహ్మదీపూర్ గ్రామానికి చెందిన శ్యామల తో వివాహం అయింది. వారికి ఇద్దరు కూతురులు భానుశ్రి, హిమబింద , కొడుకు అభిమన్యును ఉన్నారు.

నిందితుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టినా అది కూడా సరిగా నడవక పోవడంతో అప్పులు ఎక్కువై షాప్ మూసివేశాడు. డ్రై క్లీనింగ్ షాప్ పెట్టుకున్నా అది కూడా సరిగా నడవలేదు. దీంతో అప్పులు రోజురోజుకి ఎక్కవకవడంతో చిట్టి పైసలు కట్టలేక కుటుంబ కుటుంబ పోషణ భారమైంది.

డబ్బులు ఎలాగైనా సులువుగా సంపాదించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో కౌన్సిలర్ రవీందర్ ను బెదిరిస్తే డబ్బులు ఇస్తాడని భావించి అతనికి ఆకాశరామన్న బెదిరింపు లెటర్ రాశాడు. డబ్బులు ఇవ్వకపోతే కౌన్సిలర్ భార్యా పిల్లలను చంపేస్తా అని బెదిరించగా ఈ విషయంలో నిందితుడుపై గజ్వేల్ పిఎస్ లో కేసు అయింది.

నిందితుని నుండి మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలు, 54 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించారు.

Whats_app_banner