Janasena In Telangana: తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష నేరవేర్చడమే జనసేన లక్ష్యమన్న పవన్ కళ్యాణ్
Janasena In Telangana: జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలో కూా పార్టీ కార్యకలాపాలు విస్తరించాలని నేతలకు సూచిస్తున్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదని, ఒంటరిగా ఎన్నికలకు సిద్ధమవ్వాలని సూచించారు.
Janasena In Telangana: తెలంగాణ ఉద్యమ అకాంక్షలను నెరవేర్చడంలో ప్రజానీకానికి జనసేన అండగా నిలవాలని జనసేనాని సూచించారు. తెలంగాణలో సైతం జనసేన పార్టీ బలమైన శక్తిగా మారుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉనికిని కాపాడుకుంటూ బలమైన భావజాలానికి కట్టుబడి ఉంటే మంచి రోజులు వాటంతట అవే వస్తాయని చెప్పారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 1300 మంది ఆత్మబలిదానాలు చేశారని, వాళ్ల ఆకాంక్ష అయిన నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ యువతకు అందకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధించి నిష్ప్రయోజమన్నారు. ఊరికి పదిమంది బలంగా నిలబడటం వల్లే ఈ రోజు ప్రత్యేక తెలంగాణ సాకారం అయ్యిందన్నారు.
సోమవారం మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో సమావేశమయ్యారు. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 26 నియోజకవర్గాలకు ఇంచార్జులని నియమించారు. వారందరికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “జనసేన పార్టీ యూత్ వింగ్ తో ప్రారంభమై... ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందని చెప్పారు.
జనసేన భావజాలానికి ఆకర్షితులైన యువత ప్రతి గ్రామంలో ఉన్నారు. ఆ భావాన్ని పట్టుకొని ముందుకెళితే ఏదైనా సాధించగలరని, తెలంగాణ అభివృద్ధి సాధించాలి, ఉద్యమ ఆకాంక్ష నెరవేరాలి అనేది జనసేన ఆకాంక్ష అన్నారు. ఏ రాజకీయ పార్టీలోనూ ఇంతమంది కొత్తవారికి ఆవకాశం ఇవ్వరని, అవకాశాన్ని సరదాగా తీసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని” చెప్పారు.
తెలంగాణలో 26 నియోజకవర్గాల బాధ్యులను నియమించి వారికి నియామక పత్రాలు అందచేశారు.
1. నేమూరి శంకర్ గౌడ్ : కూకట్ పల్లి
2. పొన్నూరు లక్ష్మి సాయి శిరీష : ఎల్బీ నగర్
3. వంగ లక్ష్మణ గౌడ్ : నాగర్ కర్నూలు
4. తేజవత్ సంపత్ నాయక్ : వైరా
5. మిరియాల రామకృష్ణ : ఖమ్మం
6. గోకుల రవీందర్ రెడ్డి : మునుగోడు
7. నందగిరి సతీష్ కుమార్ : కుత్బుల్లాపూర్
8. డాక్టర్ మాధవరెడ్డి : శేరిలింగంపల్లి
9. ఎడమ రాజేష్ : పటాన్ చెరువు
10. మండపాక కావ్య : సనత్ నగర్
11. వై.ఎమ్.ఎన్.ఎస్.ఎస్.వి నిహారిక నాయుడు : ఉప్పల్
శివ కార్తీక్ (కో కన్వీనర్ ) : ఉప్పల్
12. వేముల కార్తీక్ : కొత్తగూడెం
13. డేగల రామచంద్రరావు : అశ్వరావుపేట
14. వి.నగేష్ : పాలకుర్తి
15. మేరుగు శివకోటి యాదవ్ : నర్సంపేట
16. గాదె పృథ్వీ : స్టేషన్ ఘనపూర్
17. తగరపు శ్రీనివాస్ : హుస్నాబాద్
18. మూల హరీష్ గౌడ్ : రామగుండం
19. బెక్కం జనార్ధన్ : జగిత్యాల
20. చెరుకుపల్లి రామలింగయ్య : నకిరేకల్
21. ఎస్.నాగేశ్వరరావు : హుజూర్ నగర్
22. మాయ రమేష్ : మంథని
23. మేకల సతీష్ రెడ్డి : కోదాడ
24. బండి నరేష్ : సత్తుపల్లి
25. బైరి వంశీకృష్ణ : వరంగల్ వెస్ట్
26. బాలు గౌడ్ : వరంగల్ ఈస్ట్
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి భూమి పూజ
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరిలో భూమి పూజ జరిగింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని పూజాదికాలు నిర్వహించారు. భూమాత ప్రీత్యర్థం నిర్వర్తించాల్సిన కార్యక్రమాలను వేద పండితుల పర్యవేక్షణలో చేపట్టారు.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ కార్యకలాపాలు ఇప్పటి వరకూ హైదరాబాద్ నుంచి సాగుతున్నాయి. ఇకపై మంగళగిరి నుంచే పార్టీ కేంద్ర వ్యవహారాలు కొనసాగించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అందులో భాగంగానే కేంద్ర కార్యాలయ భవనానికి భూమి పూజ చేపట్టారు. కార్యాలయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ నిపుణులకు పవన్ కళ్యాణ్ సూచించారు.