IDBI Recruitment 2024 : గుడ్‌న్యూస్.. ఏదైనా డిగ్రీతో బ్యాంక్ జాబ్.. జీతం రూ.29 వేలు.. ఇదిగో డైరెక్ట్ లింక్-notification for filling 1000 posts in industrial development bank of india ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Idbi Recruitment 2024 : గుడ్‌న్యూస్.. ఏదైనా డిగ్రీతో బ్యాంక్ జాబ్.. జీతం రూ.29 వేలు.. ఇదిగో డైరెక్ట్ లింక్

IDBI Recruitment 2024 : గుడ్‌న్యూస్.. ఏదైనా డిగ్రీతో బ్యాంక్ జాబ్.. జీతం రూ.29 వేలు.. ఇదిగో డైరెక్ట్ లింక్

Basani Shiva Kumar HT Telugu
Nov 11, 2024 11:44 AM IST

IDBI Recruitment 2024 : ఐడీబీఐ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వెయ్యి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఏదైనా డిగ్రీతో ఉద్యోగం కల్పిస్తోంది. https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx ఈ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐడీబీఐ బ్యాంక్
ఐడీబీఐ బ్యాంక్

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 1000 ఎగ్జిక్యూటివ్‌- సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌ పోస్టులను భర్తీ చేయబోతోంది. ఏదైనా డిగ్రీ విద్యార్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు రెండేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పనితీరు, సంస్థ అవసరాలను బట్టి.. పర్మినెంట్ ఉద్యోగంలోకి తీసుకుంటారు.

పూర్తి వివరాలు..

మొత్తం ఖాళీలు: 1000. దీంట్లో జనరల్ 448, ఓబీసీ 231, ఎస్సీ 127, ఎస్టీ 94, ఈడబ్ల్యుఎస్‌ విభాగాల్లో 100 పోస్టులు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయసు: అక్టోబరు 1, 2024 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అక్టోబరు 2, 1999 - అక్టోబరు 1, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపులు ఇచ్చారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 16

ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: డిసెంబరు 1వ తేదీ

ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాలు:

ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఏలూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం.

తెలంగాణలో.. హైదరాబాద్, వరంగల్‌, కరీంనగర్, ఖమ్మంలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తారు.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.250. మిగిలిన అందరికీ రూ.1050 ఫీజు ఉంటుంది.

అధికారిక వెబ్‌సైట్‌: https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.aspx

జీతం..

ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌లో చేరినవారికి మొదటి ఏడాది ప్రతి నెల రూ.29 వేలు ఇస్తారు. రెండో ఏడాది రూ.31 వేలు చెల్లిస్తారు. రెండేళ్ల అనంతరం బ్యాంక్ నిర్వహించే పరీక్షలో అర్హత సాధిస్తే.. పర్మినెంట్ విధుల్లోకి తీసుకుంటారు. అప్పుడు జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఓ హోదా కేటాయిస్తారు. అప్పుడు ఏడాదికి రూ.6.14 నుంచి రూ.6.50 లక్షలు అందుతుంది.

Whats_app_banner