TG Raithu Runamafi: రైతు రుణమాఫీ అందలేదా? అయితే ఇలా చేయండి..నేటి నుంచి అన్ని మండలాల్లో ప్రత్యేకశిబిరాలు-not getting farmer loan waiver do this special camps in all mandals from today ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Raithu Runamafi: రైతు రుణమాఫీ అందలేదా? అయితే ఇలా చేయండి..నేటి నుంచి అన్ని మండలాల్లో ప్రత్యేకశిబిరాలు

TG Raithu Runamafi: రైతు రుణమాఫీ అందలేదా? అయితే ఇలా చేయండి..నేటి నుంచి అన్ని మండలాల్లో ప్రత్యేకశిబిరాలు

Sarath chandra.B HT Telugu
Aug 20, 2024 10:51 AM IST

TG Raithu Runamafi: రైతు రుణమాఫీ పథకం అమలుపై రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులతో పాటు, సందేహాలను నివృత్తి చేసేందుకు నేటి నుంచి ప్రతి మండలంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రుణమాఫీ రాని రైతులకు ఉన్న ఫిర్యాదులు, సందేహాలను ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు తీరుస్తారు.

రైతు రుణమాఫీపై నేటి నుంచి స్పెషల్ డ్రైవ్‌లు
రైతు రుణమాఫీపై నేటి నుంచి స్పెషల్ డ్రైవ్‌లు

TG Raithu Runamafi: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ పథకంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. రుణమాఫీపై నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌లో రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఫిర్యాదులను పరిష్కరిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లోని వ్యవసాయ శాఖాధికారుల కార్యాలయాల్లో ఏవోలు వాఅన్న దాతలకు అందుబాటులో ఉంటారు. మండలంలో ఉన్న అన్ని బ్యాంకు శాఖలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మండల వ్యవసాయ అధికారులే బాధ్యత వహిస్తారు.

రైతుల నునంచి ఫిర్యాదులను తీసుకుని వాటిని క్రాప్ లోన్ వీవర్స్ పోర్టల్‌లో ఉన్న సమాచారంతో సరిపోలుస్తారు. అందులో ఉన్న వివరాలను రైతులకు అందచేస్తారు. దీని ద్వారా రైతుకు ఎందుకు రుణమాఫీ కాలేదో తెలిసిపోతుంది. సాంకేతిక కారణాలు కూడా తెలిసిపోతాయి.

రైతులు ఎప్పుడు, ఎంత లోన్ తీసుకున్నారు, ఏ బ్యాంకు బ్రాం చిలో తీసుకున్నారనే వివరాలు అందులో ఉంటాయి. రైతు ఆధార్ కార్డు వివరాలు తప్పుగా ఉంటే రైతుల నుంచి ఆధార్ కార్డులను తీసుకుంటారు. వాటిని ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తారు. ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలైన ఓటరు కార్డు, వాహన లైసెన్స్, రైతు రేషన్ కార్డు వంటివి కూడా అప్లోడ్ చేస్తారు.

కుటుంబానికి ప్రత్యేకంగా రేషన్‌ కార్డు లేకపోతే రైతు కుటుంబం ఆధార్ కార్డులు తీసుకుంటారు. రైతుకు పాస్‌బుక్‌ లేకపోతే పట్టాదారు పాసుపుస్తకం వచ్చినా అప్లోడ్ చేయాలి. ఆధార్‌ కార్డులో ఉన్న పేరు, బ్యాంకు లోన్ ఖాతాలో ఉన్న పేరు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. సవరణలు ఉంటే చేయాల్సి ఉంటుంది. రుణం తీసుకున్న వారి ఆధార్ కార్డును పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. అసలు, వడ్డీ మొత్తంతో సరిపోలకపోతే రైతు నుంచి దరఖాస్తును తీసుకుని వివరాలను నమోదు చేయాలి. వీటి నిర్ధారణ కోసం ఆ వివరాలను బ్యాంకులకు పంపుతారు.

రుణమాఫీ నిలిచిపోవడానికి కారణాలు ఇలా….

1.To be processed

దరఖాస్తు తలెత్తే సమస్యలకు వ్యవసాయ శాఖ పలు పరిష్కారాలను సూచించింది.

a. మీరు తీసుకున్న రుణ వివరాలు మరియు లావా దేవీల పత్రం

b. 2 లక్షల పైన ఉన్న రుణ మొత్తం జమ చేసిన పత్రం

2.Invalid aadhar number

a. మీ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్ నకలు

b. బ్యాంకు రుణ అకౌంట్ నకలు

c. మీకు సంబంధించిన దృవీకరణ పత్రం అయిన ఓటర్ ఐడి లేదా పాన్ కార్డు లేదా ఏదైనా సంబంధిత పత్రం

3.నో డేటా ఫౌండ్

a.కుటుంబ సభ్యులు అయిన భార్య భర్త మరియు పిల్లల ఆధార్ జిరాక్స్ కాపీలు

b. సంబంధిత బ్యాంక్ అకౌంట్ యొక్క మొదటి పేజీ మరియు జరిపిన లావాదేవీలు 12-12-2018 నుండి 11-12-2023

4. రెమిటెడ్

a. బ్యాంకు రుణ అకౌంట్ మరియు ఆధార్ నకలు

  • 5. ఆధార్ లోని పేరు మరియు రుణ ఖాతా లోని పేరు వేరుగా ఉన్నది

a.బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ, ఆధార్ కార్డు మరియు దానికి అనుగుణంగా పేరు ఉన్న ఓటర్ గుర్తింపు కార్డు కానీ పాన్ కార్డు కాని మరియు వేరే దృవ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది.

6. కుటుంబ సభ్యులను నిర్దారణ చేయవలసి వుంది

a. కుటుంబం అనగా భార్య భర్త మరియు పిల్లల కు సంబంధించి ఆధార్ కార్డులు

b. బ్యాంకు రుణ అకౌంట్ మొదటి పేజీ

c. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ చేసి వుంటే సంబంధించిన వివరాలు

  • 7. కుటుంబ సభ్యుల నిర్దారణ చేయ వలసి ఉన్నది ఆధార్ లోని పేరు మరియు రుణ ఖాతా లోని పేరు వేరుగా ఉన్నది
  • a. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు నకలు
  • b. రుణ ఖాతా మొదటి పేజీ మరియు బ్యాంకు అకౌంట్ నందు ఉన్న పేరు కు సంబంధించిన ఓటర్ ఐడి లేదా పాన్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు నకలు
  • 8. కుటుంబ సభ్యుల నిర్దారణ చేయవలసి ఉన్నది మరియు కుటుంబం లో మినహాయింపు లేని ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు

a. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు

b. కుటుంబం నందు ప్రభుత్వ ఉద్యోగి వివరాలు మరియు రుణ మాఫీ బ్యాంకు అకౌంట్

  • 9. కుటుంబ సభ్యులను నిర్దారణ చేయ వలసి ఉన్నది, కుటుంబంలో సర్వీసు పించన్ దారు ఉన్నారు.

a. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు నకలు

b. కుటుంబం నందు పదవి విరమణ చేసి పింఛను పొందే వ్యక్తి వివరాలు మరియు బ్యాంకు రుణ అకౌంట్ నకలు

  • 10. కుటుంబ సభ్యుల నిర్దారణ చేయ వలసి ఉన్నది, పట్టా పాస్ పుస్తకం లేదు

a. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు నకలు

b. బ్యాంకు రుణ అకౌంట్ కు జత పర్చిన పట్టా పాస్ పుస్తకం నకలు (పాత పుస్తకము లేదా కొత్త పుస్తకము నకలు)

రైతు వేదికల్లో వ్యవసాయ అధికారులు రైతు రుణమాఫీ అమలు కాకపోవడానికి ఉన్న కారణాలను బట్టి దానికి సంబంధించిన పత్రాలను అధికారులకు అందచేస్తే రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు.

సంబంధిత కథనం