NMDC Hyderabad Jobs 2024 : ఎన్‌ఎండీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన - కేవలం ఇంటర్వూనే-nmdc hyderabad recruitment notification 2024 to fill project manager jobs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nmdc Hyderabad Jobs 2024 : ఎన్‌ఎండీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన - కేవలం ఇంటర్వూనే

NMDC Hyderabad Jobs 2024 : ఎన్‌ఎండీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన - కేవలం ఇంటర్వూనే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 26, 2024 02:22 PM IST

NMDC Hyderabad Recruitment 2024: పలు ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 16 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది.

ఎన్‌ఎండీసీలో ఉద్యోగాలు
ఎన్‌ఎండీసీలో ఉద్యోగాలు (https://www.nmdc.co.in/)

NMDC Hyderabad Recruitment 2024: హైదరాబాద్ లోని ఎన్ఎండీసీ సీఎస్ఆర్ ఫౌండేషన్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రతిపాదికన వీటిని భర్తీ చేయనున్నారు. మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రాజెక్టు మేనేజర్ తో పాటు డిస్ట్రిక్ కో ఆర్డినేటర్ ఉద్యోగాలు ఉన్నాయి. బ్లాక్ కో ఆర్డినేటర్ల్ ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి.

ముఖ్య వివరాలు:

-ఉద్యోగ ప్రకటన - ఎన్ఎండీసీ సీఎస్ఆర్ ఫౌండేషన్, హైదరాబాద్

-మొత్తం ఖాళీలు - 16

ఖాళీల వివరాలు :

హెడ్ పోస్టు -01.

ప్రాజెక్ట్ మేనేజర్ -01.

మానిటరింగ్ ఎవాల్యుయేషన్ ఆఫీసర్ -01.

ఆఫీస్ మేనేజర్ -01 పోస్టు.

డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు -01 ఉద్యోగాలు.

బ్లాక్ కో ఆర్డినేటర్లు -05.

అర్హతలు - పలు పోస్టులకు ఇంజినీరింగ్, సీఏ పూర్తి చేయాలి. మరికొన్ని ఉద్యోగాలకు డిగ్రీ, పీజీతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి.

కాంట్రాక్ట్ ప్రాతిపాదికిన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

దరఖాస్తులు - ఆన్ లైన్ ద్వారా స్వీకరిస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ - 31, జనవరి, 2024.(అర్ధరాత్రి 11.59 గంటల లోపు)

ఎంపిక విధానం - ఇంటర్వూ ఆధారంగా తుది జాబితా ప్రకటిస్తారు.

అధికారిక వెబ్ సైట్ - https://www.nmdc.co.in/

మెయిల్ - nmdc@jobapply.in

RFCL Recruitment 2024: రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్ కెమికల్స్‌ కంపెనీలో ఐటిఐ విద్యార్హతతో నాన్ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్‌ఎఫ్‌ఐఎల్‌, ఈఐఎల్‌, ఎఫ్‌సిఐఎల్‌ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ నిర్వహణలో రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సిఎల్‌‌లో ఐటిఐ విద్యార్హతతో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మెకానికల్ విభాగంలో ఐటి విద్యార్హతతో అటెండెంట్‌ గ్రేడ్ 1‌లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో ఫిట్టర్‌ పోస్టులు 10, డీజిల్ మెకానిక్‌ 3, మెకానిక్‌ హెవీ వెహికల్‌ రిపేర్స్‌-మెయింటెయినెన్స్‌ లో 2 పోస్టులు భర్తీ చేస్తారు. అటెండెంట్‌ గ్రేడ్1 ఎలక్ట్రికల్ విభాగంలో 15ఎలక్ట్రిషియన్ పోస్టులు భర్తీ చేస్తారు. అటెండెంట్‌ గ్రేడ్1 ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగంలో ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ విభాగంలో 4పోస్టులు, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్ పోస్టులు 5 భర్తీ చేస్తారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.rfcl.co.in వెబ్‌సైట్‌‌లోని కెరీర్స్‌ విభాగంలో లభిస్తాయి.

ఉద్యోగాల కోసం దరఖాస్తులను సమర్పించడానికి 2024 ఫిబ్రవరి22లోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సవరణలు, మార్పులు చేర్పులు, తేదీల వివరాలను కేవలం ఆర్‌ఎఫ్‌సిఎల్‌ వెబ్‌సైట్‌లో మాత్రమే పొందుపరుస్తారు.

Whats_app_banner