Narayanpet Accident : నారాయణపేట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-రెండు కార్లు ఢీ, ఐదుగురు మృతి!-narayanpet crime news in telugu two car met accident five died ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Narayanpet Accident : నారాయణపేట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-రెండు కార్లు ఢీ, ఐదుగురు మృతి!

Narayanpet Accident : నారాయణపేట్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం-రెండు కార్లు ఢీ, ఐదుగురు మృతి!

Narayanpet Accident : నారాయణపేట్ జిల్లా మక్తల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని ఐదుగురు దుర్మరణం చెందారు.

నారాయణపేట్ రోడ్డు ప్రమాదం

Narayanpet Accident : నారాయణపేట్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్‌ మండలంలోని జక్లేర్‌లో రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయచర్యలు చేపట్టారు. ఈ కార్లలో ఒకటి కర్ణాటక, మరొకటి మహారాష్ట్రకు చెందినదిగా తెలుస్తోంది.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంతో జక్లేర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇరువైపులా వాహనాలు భారీగా నిలిటిపోయాయి. ప్రమాదానికి గురైన కార్లను రోడ్డు పక్కకు జరిపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రాక్టర్‌ ఢీకొని నలుగురు మృతిచెందారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో చనిపోయినవ వారిని చిన్నతిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులుగా గుర్తించారు. వీరంతా గుత్తి మండలం మామిడూరుకు చెందినవారుగా తేల్చారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. గార్లదిన్నే మండలం కల్లూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ప్రైవేట్‌ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.