ప్రధాని మోదీని కలిసిన మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు-my home groups chairman jupally rameswar rao meet pm modi in delhi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ప్రధాని మోదీని కలిసిన మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు

ప్రధాని మోదీని కలిసిన మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు

HT Telugu Desk HT Telugu
Nov 08, 2024 10:01 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానమంత్రికి శాలువా కప్పి సత్కరించారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా అందించారు.

ప్రధాని మోదీతో  మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు
ప్రధాని మోదీతో మై హోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు

మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, ఆయన కుమారుడు, సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ జూపల్లి రామురావు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని మోదీకి శాలువా కప్పి సత్కరించారు. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుమతిగా అందించారు.

ప్రధానమంత్రి మోదీ తన లోతైన ఆధ్యాత్మిక విలువలు, దేశానికి సేవ చేయాలనే బలమైన నిబద్ధత వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని జూపల్లి రామేశ్వరరావు చెప్పారు. ఆయన నాయకత్వ శైలి, ప్రజా సేవ పట్ల తనకున్న అంకితభావం అందరికీ తెలిసిందే అని తెలిపారు. భారతదేశంలో సమానత్వాన్ని నెలకొల్పేందుకు మోదీ చేస్తున్న కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. తనలో ఉన్న ఆ భావనకు నిదర్శనంగానే.. 2022లో హైదరాబాద్‌లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని ఆయన ప్రారంభించారని గుర్తు చేశారు.

మోదీ విలువలు, ఆయన ఆలోచనలు భారతదేశపు భవిష్యత్తు మహత్తరపూర్వకంగా తీర్చిదిద్దుతాయని రామేశ్వరరావు అన్నారు. ఇది వ్యక్తిగత వినయం, ఇతరులను ఉద్ధరించాలనే కోరిక, కరుణ, సేవా సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఒక చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగిస్తూ.. "మానవ కేంద్రీకృత విధానానికి" అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని మోదీ చెప్పిన విషయాన్ని జూపల్లి గుర్తు చేశారు.

ఇక హైదరాబాద్ శివారు ప్రాంతమైన ముచ్చింతల్‌ ఆశ్రమంలో రామానుజ సమతామూర్తి విగ్రహాన్ని 2022లో మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాలను నిర్మించారు. దివ్యదేశాల పేరుతో 108 వైష్ణవ ఆలయాలను నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి మ్యూజయంను కూడా సందర్శించారు.

Whats_app_banner

సంబంధిత కథనం