KTR On PM Modi : మోదీ సర్కార్‌కు సరుకు లేదు - మంత్రి కేటీఆర్-minister ktr slams pm modi over fuel charges ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr On Pm Modi : మోదీ సర్కార్‌కు సరుకు లేదు - మంత్రి కేటీఆర్

KTR On PM Modi : మోదీ సర్కార్‌కు సరుకు లేదు - మంత్రి కేటీఆర్

HT Telugu Desk HT Telugu
Oct 22, 2022 08:00 PM IST

ktr petrol and diesel cess: మోదీ ప్రభుత్వానికి సరుకు లేదంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ను వెంటనే తొలగించాలి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో)
మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫొటో) (twitter)

minister ktr slams pm modi: జనహితమే టీఆర్ఎస్ ప్రభుత్వ అభిమతమన్నారు మంత్రి కేటీఆర్. కులం, మతం అనేది తేడా లేకుండా సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని చెప్పారు. పారిశ్రామికవేత్తల నుంచి శ్రామికుల వరకు అన్నివర్గాలకు లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఏర్పాటు చేసిన లారీ యజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

8 ఏళ్ల తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ప్రజలంతా చూస్తున్నారని కేటీఆర్ చెప్పారు. నాడు కరెంట్ ఉంటే వార్త... కానీ ఇవాళ 15 నిమిషాలు కరెంట్ పోతే వార్త అన్నట్లు పరిస్థితి మారిందన్నారు. 24 గంటలపాటు కరెంట్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉందన్నారు. ఫ్లోరోసిస్ తో నల్గొండ జిల్లా ప్రజలు ఇబ్బందిపడుతుంటే.. నాడు కేసీఆర్ తిరిగారని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే సమస్య పరిష్కారిస్తామని చెప్పారని... అందుకు అనుగుణంగానే మిషన్ భగీరథతో మంచినీళ్లను అందిస్తున్నారని తెలిపారు. చెరువులను అభివృద్ధి చేసుకున్నామని... ప్రాజెక్టులను కట్టుకున్నామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని కేటీఆర్ ప్రశ్నించారు. యాసంగి వడ్లు కొనాలని కేంద్రానికి చెబితే... గోయల్ అనే మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడారని గుర్తు చేశారు. నూకలు తినమని చెప్పిన తెలంగాణ ప్రజలను అవమానించిన పార్టీల తోకలను కత్తిరించాలని పిలుపునిచ్చారు.

సరకు రవాణ రంగం అనేక ఇబ్బందులపై వినతులు వచ్చాయని.. వాటిని వెంటనే పరిష్కారం చేస్తామని మంత్రి కేటీఆర్ హామీనిచ్చారు. కేంద్రంలోని ప్రభుత్వానికి సరకు లేదని ఎద్దేవా చేశారు. '2014లో నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయినప్పుడు క్రూడాయిల్‌ ధర 94 డాలర్లు, ఈరోజు క్రూడాయిల్‌ ధర 98 డాలర్లుగా ఉంది. పెద్దగా తేడాలేదు. ఆరోజు లీటరు పెట్రోల్‌ ధర రూ.70లు, ఈరోజు లీటరు పెట్రోలు ధర రూ.113కి పెరిగింది. పెట్రోలు రేటు ఎందుకు పెరుగుతుంది. ముడి చమురు ధర పెరగలేదు కానీ, మోడీ చమురు ధర పెరుగుతోంది. మనం ఎలాంటి పన్నులు పెంచలేదు. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం సెస్సు విధించి ఆరేళ్లలో రూ.30లక్షల కోట్లను కేంద్రం గుంజుకున్నది. రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సెస్సుల రూపంలో వసూలు చేశారు' అని కేటీఆర్ వివరించారు.

వెంటనే కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్ లను రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. క్రూడ్ అయిల్ ధరలు పెరిగినప్పటికీ.. సెస్ ల రూపంతో దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. లీటరు పెట్రోలు రూ.70, లీటరు డీజిల్‌ రూ.65లకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జన్ దన్ ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పారని కానీ ఒక్క ఖాతాలో కూడా వేయలేదన్నారు.

మోదీ అధికారంలోకి వచ్చే నాటికి సిలిండర్ ధర రూ. 400 ఉందని... కానీ ఇవాళ రూ. 1200 అయిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ మధ్య ఆయిల్ కంపెనీలకు భారీ రాయితీలు ఇచ్చారని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నాని అన్నారు.

IPL_Entry_Point