Ramsar Lands: రామ్‌సర్ అంతర్జాతీయ చిత్తడి నేలల గుర్తింపు దిశగా మంజీరా అభయారణ్యం
Ramsar Lands: సంగారెడ్డి దగ్గర్లో ఉన్న మంజీరా అభయారణ్యానికి ప్రఖ్యాత రామ్‌సర్ అంతర్జాతీయ చిత్తడి నేలల గుర్తింపు కోసం తెలంగాణ ఫారెస్ట్, కేంద్ర ఫారెస్ట్ అధికారులు, వన్యప్రాణి ప్రేమికులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అటవీ అధికారులు మంజీరా అభయారణ్యంలో ఇప్పటి వరకు 300 రకాల పక్షులను గుర్తించారు.
Ramsar Lands: సంగారెడ్డి దగ్గర్లో ఉన్న మంజీరా అభయారణ్యానికి ప్రఖ్యాత రామ్‌సర్ అంతర్జాతీయ చిత్తడి నేలల గుర్తింపు కోసం తెలంగాణ ఫారెస్ట్, కేంద్ర ఫారెస్ట్ అధికారులు, వన్యప్రాణి ప్రేమికులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అటవీశాఖ అధికారులు, పక్షి ప్రేమికులు మంజీరా అభయారణ్యంలో ఇప్పటి వరకు 300 రకాల పక్షులను గుర్తించారు.
అందులో సుమారుగా 116 పక్షులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, ఇతర దేశాల నుండి ప్రతి సంవత్సరం మంజీరా కు వలస వచ్చివెళుతున్నట్టు గుర్తించారు. జిల్లాలో సంగారెడ్డి పట్టణానికి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో మంజీరా నది పైన నిర్మించిన మంజీరా డాం వెనక భాగంలో, ఈ అభయారణ్యం వ్యాప్తి చెందింది.
తొమ్మిది దీవులు ఎన్నో జీవజాలాలకు నిలయాలు…
ఈ డాం వెనుక భాగంలో ఉన్న తొమ్మిది దీవులలో 300 వందల రకాల పక్షులతో పాటు, ఇంకా ఎన్నో రకాల జంతువులకు నిలయంగా మారాయి. ఈ అభయారణ్యంలో పక్షులతో పాటు, 500 పైగా అరుదైన మొసళ్ళు , 57 రకాల చేపలు, 32 రకాల సీతాకోక చిలుకలు, 31 రకాల పాములు ఇతర సరీసృపాలు, 28 రకాల తూనీగలు, 25 రకాల నత్తలు ఇతర అకశేరుకాలు, 25 రకాల పువ్వు జాతికి చెందిన మొక్కలు ఇక్కడ ఉన్నట్టు శాస్త్రవేత్తలు, వన్యప్రాణి ప్రేమికులు ఇప్పటివరకు గుర్తించారు.
సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు....
ఇటీవల కేంద్ర అటవీశాఖ, పర్యావరణ అధికారులు, దక్షిణాది రాష్ట్రాలకు సంబందించిన నిపుణులు మంజీరాను సందర్శించారు. మంజీరాకు, రామ్‌సర్ చిత్తడి నేలల గుర్తింపు పొందటానికి అన్ని అర్హతలు కలిగిఉన్నాయని అభిప్రాయపడ్డారు. మంజీరా అభయారణ్యంలోకి పడవ ప్రయాణానికి వెళ్లిన అధికారులు, అక్కడ ఉన్న పక్షులను సంఖ్యను చేసి ఆనందం వ్యక్తం చేసారు.
రామ్‌సర్ చిత్తడి నేలల గుర్తింపు అంటే ఏమిటి?
అంతర్జాతీయప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలలపై కన్వెన్షన్, దీనిని సాధారణంగా రామ్‌సర్ కన్వెన్షన్అని పిలుస్తారు, ఇది చిత్తడి నేలలపరిరక్షణ, తెలివైన వినియోగాన్నిప్రోత్సహించే అంతర్జాతీయ ఒప్పందం. ఇది పర్యావరణవ్యవస్థపై దృష్టి సారించే ఏకైక ప్రపంచ ఒప్పందం. ఇప్పటివరకు రామ్‌సర్ కన్వెన్షన్ ఒప్పందం పై 168 దేశాలు సంతకం చేసాయి. ఇరాన్ దేశంలో ఉన్న రామ్‌సర్ పట్టణంలో ఈ ఒప్పందం గురించి 1971 లో వివిధ దేశాలు కలిసి ఒప్పందం చేసుకున్నాయి కాబట్టి, రామ్‌సర్ పట్టణం పేరును ఈ ఒప్పందానికి పెట్టారు.
చిత్తడినేల అంటే ఏమిటి?
రామ్‌సర్ జాబితాలోని చిత్తడినేలలు (కాలానుగుణంగా లేదా శాశ్వతంగా నీటితోనిండిన లేదా నీటితో నిండినఏదైనా భూభాగం) పర్యావరణ వ్యవస్థ సేవలు మరియు అందించినప్రయోజనాల కోసం దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడాలి.
రామ్‌సర్ సైట్‌లు ఎలా గుర్తిస్తారు…
రామ్‌సర్ సైట్‌లు నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీచే గుర్తిస్తారు. ప్రతి దేశంలో రామ్‌సర్ కన్వెన్షన్‌కు బాధ్యత వహిస్తుంది. సాంకేతిక ప్రమాణాలకుఅనుగుణంగా ఉంటే, వాటిసాపేక్ష ప్రాముఖ్యతను తగిన పరిశీలన తర్వాత రామ్‌సర్ కన్వెన్షన్ గుర్తిస్తారు. చిత్తడినేలల్లో నష్టం, క్షీణతను నివారించడానికి, తగ్గించడానికి పని చేస్తుంది.