TS Govt Mahalakshmi Scheme : తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. రేపట్నుంచే RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం, ఇవిగో గైడ్ లైన్స్-mahalakshmi scheme start from 9th december in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt Mahalakshmi Scheme : తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. రేపట్నుంచే Rtc బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం, ఇవిగో గైడ్ లైన్స్

TS Govt Mahalakshmi Scheme : తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. రేపట్నుంచే RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం, ఇవిగో గైడ్ లైన్స్

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 08, 2023 04:47 PM IST

TSRTC Free Bus Travel For Women Guildlines : మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్… కీలమైన మహాలక్ష్మి స్కీమ్ ను డిసెంబర్ 9 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

Telangana Mahalakshmi Scheme: ఆరు గ్యారెంటీల హామీలపై ఫోకస్ పెట్టింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం. గురువారం సీఎంగా రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తి కాగానే… సాయంత్రం తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆరు గ్యారెంటీల హామీల అమలుపైనే చర్చ జరిగింది. ఆరు హామీల్లో డిసెంబర్ 9వ తేదీన రెండింటిని అమలు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ నేపథ్యంలో… అందుకు తగ్గటే ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. కీలకమైన మహాలక్ష్మి స్కీమ్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అయిపోయింది.

రేపటి నుండి మహాలక్ష్మి పథకం.. గైడ్ లైన్స్..

Mahalakshmi Scheme Guidelines: మహాలక్షి పథకంలో ప్రధానంగా మూడు అంశాలు ఉండగా… ఇందులో మూడోదైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకార్యాన్ని కల్పించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే ఆర్టీసీ ఎండీ సజ్జనార్… సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు. డిసెంబర్ 9వ తేదీన ఈ స్కీమ్ ను ప్రారంభించనున్నారు. అయితే ఇందుకు సంబంధించిన కొన్ని విధివిధానాలు చూస్తే….

-రేపు మధ్యాహ్నం 01.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో ఈ స్కీమ్ ను ప్రారంభిస్తారు.

-శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ జర్నీ అవకాశం అందుబాటులోకి వస్తుంది.

-తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం ఉంటుంది. పల్లె వెలుగు,ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో కూడా అవకాశం ఉంటుంది.

-స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను జర్నీ సమయంలో కండక్టర్లకు చూపించాలి.

-కిలో మీటర్ల పరిధి విషయంలో ఎలాంటి పరిమితులు లేవు.

-ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేయబడుతుంది.

-అన్ని వయసుల మహిళలకు ఉచిత ప్రయాణ నిర్ణయం వర్తిస్తుంది.

-ట్రాన్స్ జెండర్స్ కూడా ప్రయాణం ఉచితం.

- రాష్ట్రంలోని ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. అపరిమిత కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.

-అంతరాష్ట్ర సర్వీసుల్లో సరిహద్దుల వరకు ప్రయాణం ఉచితం

- మొదటి వారం రోజులు ఎలాంటి ఐడీ కార్డు లేకుండానే ప్రయాణం

- మహిళల ప్రయాణానికి అయ్యే ఖర్చును ఆర్టీసీకి రీయింబర్స్‌ చేయనున్న ప్రభుత్వం.

"ఈ స్కీమ్ అమలు కోసం టీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్దమైంది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే దాదాపు 40 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లతో శుక్రవారం ఉదయం, మధ్యాహ్నం రెండు సార్లు వర్చువల్ గా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఉచిత బస్సు ప్రయాణ మార్గదర్శకాలను వారికి వివరించాం.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశమున్నందున, బస్ స్టేషన్ల నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఉచిత ప్రయాణం అమలులో ప్రతి సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహారించాలని, ఓపిక, సహనంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. గత రెండేళ్లుగా సిబ్బంది ప్రవర్తనలో మార్పు వచ్చిందని, దాని వల్లే సంస్థ రెవెన్యూ పెరిగిందని గుర్తుచేశారు. అదే స్పూర్తితో ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ టీఎస్ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరారు.

IPL_Entry_Point