Koheda Gutta ORR : ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కోహెడ గుట్టను చూసొద్దామా..! వ్యూపాయింట్ అస్సలు మిస్ కావొద్దు-koheda gutta hills is located very near hyderabad orr the view point here is amazing ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Koheda Gutta Orr : ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కోహెడ గుట్టను చూసొద్దామా..! వ్యూపాయింట్ అస్సలు మిస్ కావొద్దు

Koheda Gutta ORR : ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కోహెడ గుట్టను చూసొద్దామా..! వ్యూపాయింట్ అస్సలు మిస్ కావొద్దు

Koheda Hills at Hyderabad ORR : హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో కోహెడ గుట్ట ఉంది. ORRకు అనుకోని ఉన్న ఈ కొండపై నుంచి చూస్తే ప్రకృతి అందాలు అద్భుతంగా కనిపిస్తాయి. మరిన్ని వివరాలను ఈ కథనంలో చూడండి…..

కోహెడ గుట్ట (ఫైల్ ఫొటోలు)

Hyderabad Near Koheda Hills : కోహెడ గుట్ట…. హైదరాబాద్ నగరానికి అత్యంత సమీపంలో ఉంది ఈ ప్రాంతం. కొంతకాలంగా ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు(ORR)కు అనుకోని ఉన్న ఈ కొండపైకి రోడ్డు సౌకర్యం కూడా ఉంది. దీంతో చాలా మంది ఈ కొండను చూడటానికి వస్తున్నారు.

ప్రకృతి ప్రేమికులు కొహెడ గుట్టను చూసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి గడుపుతున్నారు. వీకెండ్ లో వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. మరికొందరు ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేస్తున్నారు.

ఇలా చేరుకోవచ్చు….

ఈ కోహెడ గుట్టకు(Koheda Hills) ఎల్బీ నగర్ నుంచి చేరుకోవచ్చు. అలా కాకుండా… ఔటర్ రింగ్ రోడ్డు(ORR)పై నుంచి డైరెక్ట్ గా రావొచ్చు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ దాటిన తర్వాత వచ్చే ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి కుడివైపునకు సర్వీస్ రోడ్డు నుంచి వెళ్లాలి. ఈ జంక్ష నుంచి మూడు కిలో మీటర్ల దూరంలోనే ఈ గుట్ట ఉంటుంది.  ఔటర్ రింగ్ రోడ్డు నుంచి వచ్చే వారు పెద్ద అంబర్ పేట్ జంక్షన్ లో దిగాలి. అక్కడ్నుంచి సర్వీస్ రోడ్డు మార్గం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

కోహెడ గుట్ట అబ్ధుల్లాపూర్ మెంట్ మండల పరిధిలోకి వస్తుంది.  ఇది ఎత్తైన కొండగా ఉంటుంది. ఈ కొండపై అతిపెద్దగా ఉండే ఆంజనేయస్వామి ప్రతిమ ఉంటుంది. అంతేకాకుండా కొండపైన ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు పూజలు కూడా చేస్తుంటారు.

వ్యూపాయింట్ అద్భుతం….

Koheda view point: కోహెడ గుట్ట(Koheda)కు వెళ్తే చూడాల్సిన ప్లేస్ అక్కడ ఉండే వ్యూపాయింట్. పైకి వెళ్లిన తర్వాత… పెద్దగా ఉండే కొండ అంచు ఉంటుంది. అక్కడ్నుంచి చూస్తే ఔటర్‌ రింగు రోడ్డు ఒక అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తోంది. పై నుంచి చూస్తే… ప్రకృతి అందాలు అద్భుతంగా కనిపిస్తాయి. వేసవితో పోల్చితే… వర్షాకాలంలో ఈ ప్రాంతమంతా పచ్చగా మారిపోతుంది. ఓ హిల్స్ ను తలపిస్తుంది. 

కొహెడ గుట్ట పైకి చేరుకున్న తర్వాత అక్కడి బండ రాళ్లను ఎక్కుతూ సరదాగా గడుపుతుంటారు. ఈ కొండ పై నుంచి సంఘీ టెంపులో తో పాటు రామోజీ సిటీ కూడా కనిపిస్తుంది. ఈ గుట్టపై నెమళ్లతో పాటు పలు రకాల జంతువులు కూడా కనిపిస్తాయి. ఇక్కడ పెద్దగా మౌళిక వసతులు లేవు. 

వేసవిలో ఇక్కడికి వెళ్తే మంచి నీటిని తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే కొండపైన ఓ చిన్న షాప్ ఉంది. ఇక్కడ కూల్ డ్రింక్స్ తో పాటు వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. ఇక కొండపై నుంచి చివరి అంచులకు వెళ్లకుండా తీగలతో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ కు పక్కనే ఉన్న ఈ కోహెడ గుట్ట(Koheda)ను చూడాలనుకుంటే… ఒకే రోజులో వెళ్లి రావొచ్చు. నగరానికి అత్యంత సమీపంలో ఉండటంతో పెద్దగా జర్నీ చేసే అవకాశం కూడా ఉండదు. తొందరగానే మళ్లీ తిరిగి ఇంటికి చేరుకోవచ్చు..!