ORR Deadbody: గోనెసంచిలో డెడ్‌బాడీ… ఔటర్ రింగ్‌రోడ్డులో మిస్టరీ
ORR Deadbody: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో గోనెసంచిలో మృతదేహం కలకలం రేపింది. 40ఏళ్ల వ్యక్తిని కిడ్నాప్ చేసి హతమార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
ORR Deadbody: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అండర్ పాస్ సమీపంలో డెడ్ బాడీ కలకలం రేపింది. గోనెసంచిలో కాళ్లు చేతులు కట్టేసిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వాహనాలు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన అండర్ పాస్ సమీపంలో గోనెసంచి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సంచిలో బాడీని గుర్తించారు. ఆదిభట్ల సమీపంలో బ్రహ్మణపల్లి సమీపంలో ఔటర్ రిండ్ రోడ్డు పైనుంచి మృతదేహాన్ని కిందకు పడేసినట్లు భావిస్తున్నారు.
ఔటర్ రింగు రోడ్డు వద్ద మూటలో ఉన్న గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా ఆది భట్ల పరిధి బ్రహ్మణపల్లి సమీపంలో వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గోనె సంచిలో మృతదేహాన్ని మూటకట్టి ఓఆర్ఆర్ పైనుంచి దుండగులు పడేశారు. నాలుగైదు రోజుల క్రితమే శవాన్ని పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.
గుర్తు తెలియని వ్యక్తిని కిడ్నాప్ చేసి నోటికి టేపులు వేసి ఉండటాన్ని బట్టి ఎక్కడో హత్య చేసి శవాన్ని ఆదిభట్లలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ మార్గంలో ప్రయాణించే వారు గోనె సంచి నుంచి దుర్వాసన రావడంతో అనుమానించారు. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించారు.
మృతదేహంపై బంగారు గొలుసుతో పాటు బంగారు కడియం ఉన్నట్టు గుర్తించారు. కిడ్నాప్, ఆర్ధిక లావాదేవీలు, అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగిన హత్యగా అనుమానిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.