Kawal Tiger Reserve: కనువిందు చేస్తున్న కవ్వాల్ అభయారణ్యం
Kawal Tiger Reserve: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న కవ్వాల్ అభయారణ్యం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న కవ్వాల్ అభయారణ్యంలో వివిధ రకాల జీవవైవిధ్యాలు ఉన్నాయి.
Kawal Tiger Reserve: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తరించి ఉన్న కవ్వాల్ అభయారణ్యం పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తుంది. జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో వ్యాప్తంగా విస్తరించి ఉన్న కవ్వాల్ అభయారణ్యంలో వివిధ రకాల జీవవైవిద్యాలు ఉన్నాయి.
అదిలాబాద్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ప్రకృతి అందాలతో ఆకుపచ్చటి దుప్పటి కప్పుకున్నట్లుగా, ఎన్నో రకాల వన్యప్రాణులు, ఎన్నో రకాల పక్షులు, పులులు, చిరుతలు తదితర వన్యప్రాణులు ఈ అభయారణ్యంలో సేద తీరుతున్నాయి.
ఆకుపచ్చటి దుప్పటి కప్పుకున్న దట్టమైన అడవి, ఆకాశం అంటుతున్నట్టు ఉండే కొండలు, కొండ నడుమల సరస్సులు, వాటర్ ఫాల్స్, మరొక వైపు అడవుల్లో జింకల నృత్యాలు, నెమలీల నృత్యాలు తదితర పక్షుల కిలకిల రావాలు పర్యాటకులను ఎంతో మైమరిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలోని మంచిర్యాల నిర్మల్ కొమరం భీం జిల్లాలో అటవీశాఖ ఏరియాలో సుమారు 2000 చదరపు కిలోమీటర్లు అభయారణ్యన్ని 2012 సంవత్సరంలో 42వ జాతీయ పులుల సంరక్షణ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 900 చదరపు కిలోమీటర్లు కోర్ ఏరియాగా, మిగిలిన దానిని బఫెర్ ఏరియాలో పరిగణిస్తున్నారు. ఈ అభయారణ్యంలో జంతువుల కోసం బాంబు ప్లాంట్స్, గ్రాస్, టేకు చెట్టు, మిశ్రమ చెట్లు విరివిగా పెంచారు.
పర్యాటకుల కోసం సఫారీ టూర్
అద్భుతమైన అభయారాణ్యంలో తిరగడానికి స్థానిక కవ్వాల్ అటవీ అధికారులు ఎన్నో చర్యలు చేపట్టారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకుల కోసం స్థానికంగా ఎన్నో వసతులు సమకూర్చారు. జాతీయ పులుల సంరక్షణ కేంద్రం సందర్శించడానికి వస్తున్న పర్యాటకులకు కాటేజీలు, డార్మెటరీ హాల్స్, ఏసీ గదులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. సుమారు 30 కిలోమీటర్లు జంగిల్ ప్రయాణం సఫారీలో ఉంటుంది. ఈ ప్రయాణంలో ఘటన అడవుల్లో సెల్ఫీ పాయింట్స్, హరిత రిసార్ట్స్ఉంటాయి. ప్రతిరోజు జిల్లా పర్యాటకులతో పాటు వారాంతంలో శని ఆదివారాల్లో పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు.
ఏమేమి చూడొచ్చు....
ఉమ్మడి అదిలాబాదులో కవ్వాల్ అభయాననానికి వస్తున్న పర్యటకులు ప్రకృతి అందాలతో పాటు వివిధ రకాల వణ్య ప్రాణులను చూస్తారు. అత్యధికంగా శీతాకాలం నుండి ఫిబ్రవరి వరకు వచ్చే వలస పక్షులను చూస్తారు. అదేవిధంగా అభయారణ్యంలో చుక్కల దుప్పి లు, పక్షుల కిలకిల రావాలు, వాటర్ ఫాల్స్, సరస్సులు, చిరుతలు,, ఎలుగుబంటి, సాంబార్, రకరకాల పాములు తదితర వన్యప్రాణులను తిలకించి మై మరిచిపోవచ్చు.
జన్నారం సఫారీకి ఎలా చేరుకోవాలి?
అదిలాబాద్ జిల్లా జన్నారం అడవుల సఫారీ యాత్రకు చేరుకోవడానికి రైలు ప్రయాణం అయితే హైదరాబాదు నుంచి మంచిర్యాలకు చేరుకోవచ్చు. అక్కడినుండి జన్నారానికి బస్సు సౌకర్యాలు ఉంటాయి. హైదరాబాదు నుంచి బస్సులో ప్రయాణం చేసి వచ్చే వారికి నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకొని అక్కడి నుంచి మంచిర్యాల వైపు వెళ్లే బస్సులలో జన్నారం చేరుకోవచ్చు. హైదరాబాదు నుండి సుమారు 270 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. కార్లలో వచ్చేవారు నేరుగా జిపిఎస్ మ్యాప్ పెట్టుకొని రావచ్చు.
సౌకర్యాలు..
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికుల కోసం స్థానిక అటవీశాఖ వారు వివిధ సౌకర్యాలు ఏర్పరిచారు. జన్నారంలో హరిత హోటల్ తో పాటు, 15 గదుల కాటేజీలు ఉన్నాయి, ఇందులో ఎనిమిది ఏసీ రూములు ఉండగా, మిగతావి నాన్ ఏసీ రూములు ఉన్నాయి. ఒక డార్మెటరీ హాల్ సైతం కలదు, గదులను ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవచ్చు, ఒక్కొక్క ఏసి గది జీఎస్టీ కలుపుకొని రూ 1792 ధర నిర్ణయించగా, నాన్ ఏసి గదికి రూపాయలు 1176 ధర కలదు. ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు మరియు 10 గంటలకు సఫారీ సౌకర్యం కలదు, సాయంత్రం నాలుగు గంటలకు సఫారీ యాత్ర ఉంటుంది. సఫారీలు అడవిలోకి తీసుకెళ్లి వివిధ ప్రదేశాలలో వన్యప్రాణులను చూపిస్తారు.
రిపోర్టర్ : వేణుగోపాల్ కామోజీ, ఆదిలాబాద్ న్యూస్.