Kakatiya Utsavalu : 700 ఏళ్ల తర్వాత ఓరుగల్లుకు కాకతీయుల వారసుడు!
కాకతీయుల చరిత్ర అనగానే ముందుగా గుర్తొచ్చేంది ఓరుగల్లు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం అది. ఇప్పుడు అక్కడకు అప్పటి మహా సామ్రాజ్యపు వారసుడు రానున్నారు. ఆయనే కమల్ చంద్ర భంజ్ దేవ్.
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా వచ్చే నెల 7వ తేదీ నుంచి ఏడు రోజులపాటు కాకతీయ ఉత్సవాలు జరగనున్నాయి. దీనికోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఉత్సవాలకు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్‌ను తెలంగాణ ప్రభుత్వం ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. 700 సంవత్సరాల చరిత్ర గల కాకతీయుల కాలం నాటి అద్భుత కళా నైపుణ్యాలకు ప్రతీకగా ప్రసిద్ధికెక్కిన పర్యాటక ప్రాంతాలను పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. 1262 - 1323 మధ్య సామ్రాజ్యం పతనమైన కాలం. అప్పటి శిల్పా సంపద ఇంకా చెక్కుచెదరకుండా ఉంది.
ప్రభుత్వ చీఫ్‌విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య ఛత్తీస్ ఘడ్ లోని జగదల్పూర్ చేరుకున్నారు. బస్తర్ లో మహారాజ కమల్ చంద్ర భంజ్ దేవ్‌ను కలిశారు. కాకతీయుల వారసుడిగా.. కాకతీయ ఉత్సవాలకు రావాలని కోరారు. తప్పకుండా ఉత్సవాలకు వాస్తనని ఆయన చెప్పారు.
'మా పూర్వీకుల పుట్టినిల్లు నాకూ పుట్టినిల్లే. అలాంటి పుట్టినింటికి 700 సంవత్సరాల తర్వాత మా వారసత్వం సందర్శించే అవకాశం రావడం చాలా సంతోషం. తెలంగాణ ప్రభుత్వం కాకతీయ సప్తాహం పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం మంచి నిర్ణయం. ప్రభుత్వం గొప్ప పనిచేస్తుంది. మన చారిత్రక వారసత్వాన్ని ఈ తరానికి పరిచయం చేయాలి. వరంగల్ నగరాన్ని చూడాలనే నా చిరకాల కోరిక త్వరలో తీరనుంది.' అని కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ అన్నారు.
ఇప్పటికే తెలంగాణ సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ కాకతీయ ఉత్సవాలకు కోసం ఏర్పాట్లు చేస్తోంది. కాకతీయ సప్తాహం పేరుతో 7 రోజుల పాటు కార్యక్రమాలు జరుగుతాయి. జులై 7 నుంచి 14 వరకలు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా.. కాకతీయ సామ్రాజ్య వారసుడు కమల్ చంద్ర భంజ్ దేవ్ రూపం 700 సంవత్సరాల తర్వాత ఓరుగల్లులో అడుగుపెట్టనున్నారు.
టాపిక్