Jagityala SI Issue: జగిత్యాలలో విచిత్రం, పరారీలో ఉన్న ఎస్ఐ వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు-jagityala police official orders of transfer to absconding si in to vr ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagityala Si Issue: జగిత్యాలలో విచిత్రం, పరారీలో ఉన్న ఎస్ఐ వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు

Jagityala SI Issue: జగిత్యాలలో విచిత్రం, పరారీలో ఉన్న ఎస్ఐ వీఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు

HT Telugu Desk HT Telugu
Jul 11, 2024 06:06 AM IST

Jagityala SI Issue: జగిత్యాల జిల్లాలో ఎస్ఐ లో బదిలీల్లో విచిత్రం చోటు చేసుకుంది.‌ ఏసిబి కేసు నుంచి తప్పించుకునేందుకు పరారీలో ఉన్న ఎస్ఐ ని వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేశారు.

పరారీలో ఉన్న ఎస్సైను విఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు
పరారీలో ఉన్న ఎస్సైను విఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు

Jagityala SI Issue: జగిత్యాల జిల్లాలో ఎస్ఐ లో బదిలీల్లో విచిత్రం చోటు చేసుకుంది.‌ ఏసిబి కేసు నుంచి తప్పించుకునేందుకు పరారీలో ఉన్న ఎస్ఐ ని వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేశారు. గత నెల 22న ఇసుక అక్రమ రవాణా చేసే నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.10 వేలు తీసుకునేందుకు యత్నించి ఏసిబి ట్రాప్ నుంచి తృటిలో తప్పించుకున్నారు.

రాయికల్ ఎస్ఐ అజయ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్ ఐ ఆచూకీ లభించలేదు. అతని కోసం ఏసిబి అధికారులు గాలిస్తున్నారు. ఎసిబి చిక్కకుండా పోలీసులకు దొరకకుండా పోయిన ఎస్ఐ పై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

స్టేషన్ హౌస్ ఆఫీసర్ అడ్రస్ లేకుండా పోతే అతడు ఎక్కడున్నాడో తెలుసుకోవాల్సిన పోలీస్ అధికారులు అతని అవినీతికి ఊతమిచ్చేలా వ్యరించడం స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. పోలీసుల తీరు అభాసుపాలయ్యే పరిస్థితి కనిపిస్తుంది. పత్తాలేకుండా పారిపోయిన ఎస్ ఐ ని విఆర్ కు బదిలీ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేపథ్యంలో నిందితులు ఎక్కడున్నా దొరకబట్టే పోలీసులు, ఒక ఎస్ఐ పారిపోతే ఇప్పటి వరకు అతని ఆచూకీ కనుకోకుండా బదిలీ వేటు వేయడం పోలీసులు ఏం చేసినా చేల్లుబాటు అవుతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

18 మంది ఎస్ఐ లు బదిలీ

జగిత్యాల జిల్లాలో 18 మంది ఎస్ఐ లను బదిలీ అయ్యారు. బదిలీ ఉత్తర్వులు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ జారీ చేశారు. జిల్లాలో బదిలీలు అయిన ఎస్సైల వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్బీఐలో పని చేస్తున్న టి అశోక్ రాయికల్ కు అక్కడ పని చేస్తున్న అజయ్ ని వెకెన్సీ రిజర్వుకు, పెగడపల్లి ఎస్సై జె.రామకృష్ణ సీసీఎస్ కు, ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ లో పని చేస్తున్న సిహెచ్ రవికిరణ్ పెగడపల్లికి, గుడిహత్నూరు ఎస్సై ఇమ్రాన్ సయ్యద్ జగిత్యాల టౌన్ పీఎస్ 1 ఎస్సైగా, బీర్పూర్ ఎస్సై గౌతం పవార్ వెకెన్సీ రిజర్వుకు, మల్యాల ఠాణా 2 ఎస్సై కె.కుమార స్వామి బీర్పూర్ కు బదిలీ అయ్యారు.

ఆదిలాబాద్ జిల్లా గడిగుడ ఎస్సై గంగుల మహేష్ జగిత్యాల టౌన్ 2 ఎస్సైగా, నిర్మల్ జిల్లా భైంసా ఎస్సై వై ఇంద్రకరణ్ రెడ్డి ధర్మపుర్ రెండో ఎస్సైగా, వెకెన్సీ రిజర్వులో ఉన్న సిహెచ్ సుధీర్ రావు మల్యాల 2 ఎస్సైగా, జగిత్యాల సీసీఎస్ ఎస్సై పి.దత్తాద్రి సారంగపూర్ కు, వీఆర్ లో ఉన్న కె రాజు మెట్ పల్లి రెండో ఎస్సైగా, జగిత్యాల టౌన్ వన్ ఎస్సై మల్యాల ఎస్సై వన్ గా, మల్యాల వన్ ఎస్సై అబ్దుల్ రహీమ్ స్పెషల్ బ్రాంచ్ కు, వెకెన్సీ రిజర్వులో ఉన్న పి గీత జిల్లా క్రైం రికార్డ్ బ్యూరోకు, సారంగపూర్ ఎస్సై ఎ తిరుపతి వీఆర్ కు, కోరుట్ల స్టేషన్ లో అటాచ్డ్ డ్యూటీలో ఉన్న మహ్మద్ అరీఫుద్దీన్ జగిత్యాల పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ అయ్యారు.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner