YS Sharmila Episode : మరో ప్రత్యర్థిని రెడీ చేయడమే టీఆర్ఎస్ టార్గెటా?-is that trs strategy workout on ys sharmila episode ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Is That Trs Strategy Workout On Ys Sharmila Episode?

YS Sharmila Episode : మరో ప్రత్యర్థిని రెడీ చేయడమే టీఆర్ఎస్ టార్గెటా?

HT Telugu Desk HT Telugu
Dec 05, 2022 02:07 PM IST

Telangana Politics : తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ ఆమె ఎవరు వదిలిన బాణం అనే విషయంపైనే చర్చ నడుస్తోంది. కొన్ని రోజుల నుంచి ఆమె పాలిటిక్స్ వైపు అందరి దృష్టి పడుతోంది. కేవలం వారం రోజుల్లో సీన్ అంతా మారిపోయింది. ఎందుకిలా? టీఆర్ఎస్ టార్గెట్ లో భాగమేనా?

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల (twitter)

రాజకీయాల్లో ఎప్పుడు.. ఎవరు.. ఎవరినీ హైప్ చేస్తారో చెప్పడం కష్టం. కొన్నిసార్లు ప్రత్యర్థులను తొక్కాలంటే.. మరొకరిని పైకి లేపాలి. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇదే ప్లాన్ వేసిందా? కొన్నిరోజులుగా వైఎస్ షర్మిల పేరే ఎక్కువ ఎందుకు వినిపిస్తుంది? మరోవైపు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతున్నా.. వైఎస్ షర్మిల్ ఎపిసోడ్ హాట్ టాపిక్ ఎందుకు అయింది? ఇలాంటి ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ.. వైఎస్ఆర్టీపీ(YSRTP) అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర మెుదలుపెట్టారు. సుమారు 3500 కిలో మీటర్లకు పైగా పాదయాత్ర(Padayatra) పూర్తి చేశారు. కానీ ఎప్పుడూ లేని విధంగా.. ఇప్పుడెందుకు ఆమె పాలిటిక్స్ హాట్ టాపిక్ అయ్యాయి? 3500 కిలో మీటర్ల పాదయాత్రలో ఎక్కడా ఆమెకు ఎందుకు ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు? మెుదటి నుంచి షర్మిల కేసీఆర్, ఆయన ఫ్యామిలీ టార్గెట్ గా విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత విమర్శలు మెల్లమెల్లగా మంత్రులు, ఎమ్మెల్యేల మీదకు వెళ్లాయి.

నిజానికి ఇలాంటి ఇష్యూ గతంలోనే జరగాల్సి ఉంది. కానీ ఆ ఘటన హైలెట్ అయి.. మళ్లీ ఎందుకో సైలెంట్ అయిపోయింది. వనపర్తి జిల్లాలో పర్యటన సందర్భంగా షర్మిల(Sharmila) వర్సెస్ మంత్రి నిరంజన్ రెడ్డి మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినంతంగా హైప్ మాత్రం అప్పుడు క్రియేట్ కాలేదు. ఇటీవల నర్సంపేటలో వైఎస్ఆర్టీపీ(YSRTP) బస్సు దగ్ధం నుంచి రచ్చ నడుస్తూనే ఉంది. ఆ తర్వాత హైదరాబాద్(Hyderabad)లో కారులో ఉండగానే షర్మిలను ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లడంతో వివాదం ఎక్కువైంది. 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసినా.. రాని మైలేజ్ ఇప్పుడు షర్మిలకు వచ్చిందనే చర్చ ఉంది. అయితే ఈ ఘటనలను టీఆర్ఎస్ పార్టీ(TRS Party) తమకు ప్లస్ గా అనుకుంటుందట.

మరోవైపు బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay).. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర(Praja Sangrama Yatra) నడుస్తోంది. గతంలో ఆయన పాదయాత్రకు గురించిన విషయాలు జనాల్లోకి వెళ్లినంతంగా ఇప్పుడు మాత్రం వెళ్లడం లేదని చర్చ ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీలో భాగమే ఇది అనే మరో వాదన వినిపిస్తోంది. ఓవైపు రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది. రాజకీయాల్లో శత్రువును ఓడించాలంటే.. మరో శత్రువును తయారుచేసుకోవడమే బెటర్ అనే సిద్దాంతాన్ని టీఆర్ఎస్ ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

బీజేపీ(BJP) చేస్తున్న ఈవెంట్స్ ను డౌన్ చేయాలంటే.. మరొకరిని పైకి లేపాలి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి షర్మిల అలానే ఉపయోగపడుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్(Congress) పార్టీని ఎలాగూ కేసీఆర్ పట్టించుకోవడం మానేసి చాలా రోజులైందని అందరూ అనుకుంటున్నదే. సో.. ఇప్పుడు అస్త్రంగా షర్మిల ఉపయోగపడుతుందని.. గులాబీ పార్టీ అనుకుంటోంది. ఒకవేళ షర్మిలకు మైలేజీ పెరిగినా.. ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం అయితే ఏమీ లేదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

కేసీఆర్(KCR) మాస్టర్ మైండ్ ఇలానే ఉంటుందని చెప్పేవారూ చాలా మందే ఉన్నారు. అంతకుముందు కూడా.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడి.. ఆ తర్వాత పట్టించుకోవడమే మానేశారు. ఇప్పుడు రివర్స్ గేమ్ లో కేసీఆర్ వెళ్తున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట. ప్రత్యర్థిని తొక్కితే.. మరో ప్రత్యర్థి పుట్టుకొస్తున్నాడని, అదే ఇంకో ప్రత్యర్థిని తయారు చేసుకుంటేనే లాభం అనే ఆలోచనలో ఉన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరో విషయం ఏంటంటే.. రా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలేందుకు కూడా వైఎస్ఆర్టీపీ ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేసుకుంటుందని చర్చ నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ కు కూడా ఓట్లు చీలుతాయి. దీంతో టీఆర్ఎస్ లాభం పొందవచ్చు. అయితే బీజేపీ వదిలిన బాణం షర్మిల అని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కేసీఆర్ వదిలిన బాణం అని.. కాంగ్రెస్ నేతలు ఇంకోవైపు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూస్తూ ఉండాలి.

IPL_Entry_Point

సంబంధిత కథనం