IRCTC Karnataka Tour : గోకర్ణ, ధర్మస్థలి, శృంగేరి, ఉడిపి ట్రిప్ - హైదరాబాద్ నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ
IRCTC Hyderabad Karnataka Tour: కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ధరలు, డేట్స్ వివరాలను పేర్కొంది
IRCTC Hyderabad Karnataka Tour: దేశంలోని వివిధ ప్రాంతాలను చూడాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం అందుబాటు ధరలలో ప్యాకేజీలు ప్రకటిస్తోంది. ఇందులో టూరిజం ప్రాంతాలే కాకుండా... అధ్యాత్మిక ప్రాంతాలు కూడా ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని పలు ప్రాంతాలను చూసేందుకు ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'DIVINE KARNATAKA' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో ఉడిపి, శృంగేరి, ధర్మస్థల, మంగళూరు వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రస్తుతం ఈ టూర్ ఫిబ్రవరి,23, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
మొదటి రోజు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. మంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. పలు ప్రాంతాలను సందర్శిస్తారు. రాత్రికి ఉడిపిలో బస చేస్తారు. ఉడిపి నుంచి హోర్నాడుకు బయల్దేరుతారు. అన్నపూర్ణేశ్వరిస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి కూడా ఉడిపిలోనే ఉంటారు. మూడో రోజు కొల్లూరుకు వెళ్తారు. ముక్కాంబికా ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడ్నుంచి గోకర్ణకు బయల్దేరుతారు. రాత్రికి మురుడేశ్వర్ లో ఉంటారు. నాలుగో రోజు ధర్మస్థలికి వెళ్తారు. ఆ తర్వాత…. మంగళూరు నుంచి హైదరాబాద్ ప్రయాణం మొదలవుతుంది.దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టికెట్ రేట్ల వివరాలు:
కర్ణాటక టూర్ ప్యాకేజీ చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 43,800 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 34,400ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.33050గా ఉంది. కంఫర్ట్ క్లాస్ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.