IRCTC Coastal Karnataka Tour : కర్ణాటక టూర్ కి వెళ్లొద్దామా! తక్కువ ధరలోనే 6 రోజుల ప్యాకేజీ-irctc tourism announced latest coastal karnataka tour package from telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Coastal Karnataka Tour : కర్ణాటక టూర్ కి వెళ్లొద్దామా! తక్కువ ధరలోనే 6 రోజుల ప్యాకేజీ

IRCTC Coastal Karnataka Tour : కర్ణాటక టూర్ కి వెళ్లొద్దామా! తక్కువ ధరలోనే 6 రోజుల ప్యాకేజీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 28, 2023 03:16 PM IST

Hyderabad - Coastal Karnataka Tour: హైదరాబాద్ నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. 6 రోజలు టూర్ షెడ్యూల్ వివరాలను వెల్లడించటంతో పాటు… ముఖ్య తేదీలను ప్రకటించింది.

కర్ణాటక టూర్
కర్ణాటక టూర్ (facebook)

IRCTC Tourism Coastal Karnataka Tour Package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో అధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఉంటున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. Coastal Karnataka పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. ఉడిపి, శృంగేరి, మురుదేశ్వర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ…. జులై 4, 2023వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

మొదటిరోజు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 ట్రైన్(No.12789, Kacheguda - Mangalore Central Express) బయల్దేరుతుంది. రెండో రోజు ఉదయం 09.30 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఉడిపికి చేరుకుంటారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత... శ్రీకృష్ణ ఆలయం, సెయింట్ మేరీ ఐల్యాండ్, మల్పీ బీచ్ ను సందర్శిస్తారు. రాత్రి ఉడిపిలోనే బస చేస్తారు.

ఇక మూడో రోజు ఉడిపి నుంచి శృంగేరికి బయల్దేరారు. ఇక్కడ శారదాంబ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం కొల్లూరు, ముకాంబికా ఆలయాలకు వెళ్తారు. ఆ తర్వాత మురుదేశ్వర్ కు చేరుకుంటారు. నాల్గొ రోజు ఉదయమే ఆలయ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి జోగ్ వాటర్ ఫాల్స్ కు వెళ్తారు. మధ్యాహ్నం గోకర్నా సందర్శన తర్వాత... తిరిగి మురుదేశ్వర్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఐదో రోజు మంగళూరుకు చేరుకుంటారు. కటీల్, మంగలా ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రి 7 గంటల వరకు మంగళూరు సెంట్రల్ కు చేరుకొని హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతారు. ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ ముగుస్తుంది.

టికెట్ రేట్లు:

ఈ కర్ణాటక టూర్ ప్యాకేజీ చూస్తే…. సింగిల్ షేరింగ్ కు 34540 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 19700 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 15590గాఉంది. ఈ రేట్లు Comfort (3A) క్లాస్ లో ఉన్నాయి. స్టాండర్డ్ ధరలో తక్కువగా ఉన్నాయి. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం