TS AP Weather : ఐఎండీ అలర్ట్.. ఏపీలో తేలికపాటి, తెలంగాణకు భారీ వర్ష సూచన - ఎల్లో హెచ్చరికలు జారీ
Telangana and AP Weather News: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఇచ్చింది ఐఎండీ. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా… ఆంధ్రప్రదేశ్ తేలికపాటి వర్షాలు పడుతాయని పేర్కొంది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.
Telangana and AP Weather Updates : గత రెండు రోజులుగా మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వానలు పడుతుండగా… మరికొన్నిచోట్ల వాతావరణం చల్లబడిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో… తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. రాగల రెండురోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
ట్రెండింగ్ వార్తలు
ఇవాళ్టి నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇక శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
బుధవారం, గురువారవం ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, ములుగు, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. సిరిసిల్లలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. ఈనెల 23వ తేదీ వరకు రాష్ట్రంలోని పలుచోట్ల వానలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.
ఏపీలో మోస్తరు వర్షాలు…
ఏపీకి వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. రేపు (22-09-2023) దాదాపు రాాష్ట్రమంతటా మబ్బుగా ఉండి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్య సాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.