TS ECT Results 2024 : తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!-hyderabad ts ecet 2024 results released check in results process download rank card ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ect Results 2024 : తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

TS ECT Results 2024 : తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి!

Bandaru Satyaprasad HT Telugu
May 20, 2024 01:30 PM IST

TS ECT Results 2024 : తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు టీఎస్ ఈసెట్ అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, ఈ డైరెక్ట్ లింక్ లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల, ఈ డైరెక్ట్ లింక్ లో చెక్ చేసుకోండి!

TS ECT Results 2024 : తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి. పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథ్స్) విద్యార్థులకు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఈసెట్(TS ECET 2024) ఫలితాలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. అభ్యర్థులు ఫలితాలను https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఈసెట్ - 2024 ఫలితాలు వచ్చేశాయి. ఉన్నత విద్యామండలి అధికారులు సోమవారం ఫలితాలను విడుదల చేశారు. బీటెక్‌ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం తెలంగాణ ఈసెట్ - 2024 ప్రవేశ పరీక్షను నిర్వహించారు. మే 6న రాష్ట్రవ్యాప్తంగా ఈసెట్ ఎగ్జామ్స్ జరిగాయి. ఈ పరీక్ష ఫలితాల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులకు బీటెక్, బీఫార్మసీ లేటరల్‌ ఎంట్రీ రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించింది.

ఈసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోవచ్చు

Step 1 : తెలంగాణ ఈసెట్-2024 ఫలితాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://ecet.tsche.ac.in/ పై క్లిక్ చేయాలి.

Step 2 : హోమ్ పేజీలో కనిపించే ' Download Rank Card' పై క్లిక్ చేయాలి.

Step 3 : హాల్ టికెట్, రిజిస్ట్రేషన్ నెం, పుట్టిన తేదీ వివరాలు చేసి 'View Rank Card' మీద క్లిక్ చేయాలి.

Step 4 : టీఎస్ ఈసెట్ 2024 ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి

Step 5 : విద్యార్థులు ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ ర్యాంక్ కార్డును పొందవచ్చు.

95.86 శాతం ఉత్తీర్ణత

తెలంగాణ ఈసెట్ ఫలితాలను సోమవారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి, ఉస్మానియా వర్సిటీ వీసీ రవీందర్ విడుదల చేశారు. అభ్యర్థుల ర్యాంకు కార్డులను ఈసెట్ వెబ్‌సైట్‌ లో అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది మొత్తం 23,330 మంది ఈసెట్ రాయగా, వీరిలో 22,365 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది ఈసెట్ లో 95.86 శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు తెలిపారు. బీఎస్సీ మాథ్స్ లో పెద్దపల్లికి చెందిన యాదగిరి ఈసెట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. మీర్ ఐజాజ్ అలీ రెండో ర్యాంక్ సాధించగా, కెమికల్ ఇంజినీరింగ్ లో ఏపీలోని విశాఖకు చెందిన బంక మనోహర్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఈ ఏడాది మే 6న ఈసెట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 99 పరీక్ష కేంద్రాల్లో ఈసెట్ నిర్వహించారు. మొత్తం 24,272 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.

గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సర ఇంటర్‌ ప్రవేశాలకు ఏప్రిల్‌ 28న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను నిన్న(మే 19న) గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు రిలీజ్ చేశారు. ఈ పరీక్షలో విద్యార్థుల మెరిట్‌ ఆధారంగా ఆయా కాలేజీల్లో సీట్లు కేటాయించామన్నారు. జూనియర్ కాలేజీల్లో సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో మే 20 నుంచి 30వ తేదీలోపు రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు. విద్యార్థులు బీసీ ఆర్జేసీ సెట్ ఫలితాలను గురుకుల వెబ్‌సైట్‌ https://mjpabcwreis.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు.