TS ECET 2024 Results : రేపు తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి-ts ecet 2024 results to be released on 20 may 2024 direct links are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ecet 2024 Results : రేపు తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

TS ECET 2024 Results : రేపు తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
May 19, 2024 08:27 AM IST

TS ECET 2024 Results Updates: తెలంగాణ ఈసెట్ - 2024 ఫలితాల విడుదలకు టైమ్ ఫిక్స్ అయింది. మే 20వ తేదీన రిజల్ట్స్ అందుబాటులోకి రానున్నాయి.

తెలంగాణ ఈసెట్  2024 ఫలితాలు
తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాలు

TS ECET 2024 Results : తెలంగాణ ఈసెట్ - 2024 ఫలితాలు వచ్చేస్తున్నాయ్. ఇందుకు అధికారులు ముహుర్తం ఫిక్స్ చేశారు. మే 20వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

బీటెక్‌ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం తెలంగాణ ఈసెట్ - 2024 పరీక్షను నిర్వహిస్తున్నారు. మే 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరిగింది. ఈ పరీక్ష ఫలితాల్లో వచ్చిన ర్యాంకల ఆధారంగా….. పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌ , బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలు పొందుతారు. ఈ ఏడాది ఈసెట్ పరీక్షను ఉస్మానియా వర్శిటీ నిర్వహించింది.

How to Check TS ECET 2024 Results : ఈసెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు….

  • తెలంగాణ ఈసెట్ 2024 పరీక్షలు రాసిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://ecet.tsche.ac.in/ లోకి వెళ్లాలి,
  • హోమ్ పేజీలో కనిపించే 'టీఎస్ ఈసెట్ రిజల్ట్స్ - 2024 పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.
  • టీఎస్ ఈసెట్ 2024 ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • ప్రింట్ ఆప్షన్ పై నొక్కి మీ ర్యాంక్ కార్డును పొందవచ్చు.

తెలంగాణ పీజీఈసెట్ పరీక్షల షెడ్యూల్ మార్పు

TS PGECET 2024 Updates : తెలంగాణలో పీజీఈసెట్‌ -2024 పరీక్షల షెడ్యూల్ మారింది. ఈ మేరకు అధికారులు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో PGECET రాత ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో మార్పులు చేసిన‌ట్లు కన్వీన‌ర్ డాక్ట‌ర్ ఏ అరుణ కుమారి వెల్ల‌డించారు.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. పీజీఈసెట్‌ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. జూన్ 9వ తేదీతో ఎగ్జామ్స్ పూర్తి కావాలి. కానీ స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ ప‌రీక్ష‌లు, టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ల నేప‌థ్యంలో పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేశారు. తెలంగాణ పీజీఈసెట్ రాత‌ ప‌రీక్ష‌ల‌ను జూన్ 10 నుంచి ప్రారంభించనున్నారు. జూన్ 13వ తేదీతో పూర్తి కానున్నాయి.

ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పీజీఈసెట్‌(TS PGECET 2024 ) ను నిర్వహిస్తున్నారు. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్, , ఎంఫార్మసీ, ఫార్మా-డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. https://pgecet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

  • ప్రవేశ పరీక్ష - టీఎస్‌పీజీఈసెట్ 2024(TS PGECET 22024)
  • పరీక్ష నిర్వహించే వర్శిటీ -జేఎన్‌టీయూ, హైదరాబాద్
  • కోర్సులు - ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా-డి
  • అర్హతలు - అభ్యర్థులు బీఈ/బీటెక్/బీఆర్క్/ బీప్లానింగ్/బీఫార్మసీ, ఎంఏ/ఎంఎస్సీ (సోషియాలజీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ) ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తిస్థాయి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.
  • దరఖాస్తులు - ఆన్ లైన్
  • రూ.2500 ఆల‌స్య రుసుముతో అప్లికేషన్లకు తుది గడువు - 21-మే-2024.
  • రూ.5000 ఆల‌స్య రుసుముతో దరఖాస్తులకు చివరితేదీ - 25-మే-2024.
  • హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌: 28 మే 2024.
  • పరీక్షలు ప్రారంభం - జూన్ 10, 2024.
  • పరీక్షలు పూర్తి అయ్యే తేదీ - జూన్ 13, 2024.
  • అధికారిక వెబ్ సైట్ - https://pgecet.tsche.ac.in/
  • దరఖాస్తు లింక్ - https://pgecet.tsche.ac.in/PGECET_HomePage.aspx

టీ20 వరల్డ్ కప్ 2024