OU Distance Admissions : ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - కోర్సులు, ముఖ్య తేదీలివే-osmania university distance education phase 2 admissions notification released check key dates are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ou Distance Admissions : ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - కోర్సులు, ముఖ్య తేదీలివే

OU Distance Admissions : ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - కోర్సులు, ముఖ్య తేదీలివే

OU Distance Education Admissions Updates: దూర విద్యలో డిగ్రీ, పీజీ చేయాలనుకునేవారికి మరో అలర్ట్ ఇచ్చింది ఉస్మానియా వర్శిటీ. గతేడాదికి సంబంధించి ఫేజ్ - 2 అడ్మిషన్ నోటిఫికేషషన్ జారీ చేసింది.

ఓయూ దర విద్యలో ప్రవేశాలు (http://www.oucde.net/)

Prof. G. Ram Reddy Centre for Distance Education Updates: ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విభాగం. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ ఫేజ్ -2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా…. డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనుంది. దరఖాస్తుల ప్రక్రియ మొదలుకాగా... మార్చి 31, 2024వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.

ముఖ్య వివరాలు:

యూనివర్శిటీ - ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, ఉస్మానియా వర్శిటీ

కోర్సుల వివరాలు: ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, పీజీ డిప్లొమా కోర్సులు.

కోర్సుల వ్యవధి: ఆయా కోర్సులను అనుసరించి ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది. డిప్లోమా కోర్సుల వ్యవధి సంవత్సరం

మీడియం : కొన్ని కోర్సులు తెలుగు మీడియంలో, మరికొన్ని ఇంగ్లీష్ మీడియాలో ఉన్నాయి.

అర్హత: కోర్సులను అనుసరించి ఇంటర్మీడియట్‌ (10+2) / తత్సమాన, గ్రాడ్యుయేషన్, బీకాం, టీఎస్‌ ఐసెట్‌/ ఏపీఐసెట్‌ ఎంట్రెన్స్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.మార్చి.2024

మెయిల్ - info_cde@osmania.ac.in

అధికారిక వెబ్ సైట్ - https://oupgrrcde.com/

ఇలా దరఖాస్తు చేసుకోండి...

http://www.oucde.net/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి. Online Admission' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ యూజీ, పీజీ, డిప్లోమా, ఎంబీఎం, ఎంసీఏ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయాలి.

-ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ కావాలి. ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఆ తర్వాత కోర్సు ఎంపిక చేసుకోవటం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవాలి. ఇక కోర్సుల ఫీజు సెమిస్టర్ల వారీగా కట్టుకోవచ్చు.