Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడుల వెల్లువ- బుద్వేల్, గండిపేట, కోకాపేట్ లో మరిన్ని ప్రాజెక్టులు-hyderabad real estate sector witness investments from it banking financial services knight frank report ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడుల వెల్లువ- బుద్వేల్, గండిపేట, కోకాపేట్ లో మరిన్ని ప్రాజెక్టులు

Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడుల వెల్లువ- బుద్వేల్, గండిపేట, కోకాపేట్ లో మరిన్ని ప్రాజెక్టులు

Bandaru Satyaprasad HT Telugu
Aug 27, 2023 07:35 PM IST

Real Estate : 2047 నాటికి భారతదేశం రియల్ ఎస్టేట్ మార్కెట్ 5.8 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని పేర్కొంది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Image Source : Hyderabad Real Estate Twitter)

Real Estate : రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి సాధిస్తున్న హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల కారణంగా భారతదేశం రియల్ ఎస్టేట్ రంగం 2022లోని 477 బిలియన్ల డాలర్ల మార్కెట్ నుంచి 2047 నాటికి 5.8 ట్రిలియన్ల డాలర్లకు విస్తరిస్తుంది. నైట్ ఫ్రాంక్, నేషనల్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి మండలి సంయుక్త నివేదిక ఈ విషయాన్ని పేర్కొంది. ఈ వృద్ధి దేశం ఆర్థిక ఉత్పత్తికి 15 శాతానికి పైగా దోహదం చేస్తుందని నైట్ ఫ్రాంక్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ నివేదిక తెలిపింది. ప్రధానంగా వేర్‌హౌసింగ్, రెసిడెన్షియల్ విభాగాలు 12 రెట్లు ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తాయని పేర్కొంది. ఇండియా రియల్ ఎస్టేట్ : విజన్ 2047 పేరుతో రియల్టర్ల సంఘం నరెడ్‌కో, రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ సంయుక్త నివేదికను శనివారం విడుదల చేసింది.

2047కి 5.8 ట్రిలియన్ డాలర్ల మార్కెట్

భారతదేశం రియల్ ఎస్టేట్ రంగం 2047 నాటికి $5.8 ట్రిలియన్ కు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ అంచనా ప్రకారం రియల్ ఎస్టేట్ అవుట్‌పుట్ విలువ 2047లో మొత్తం ఆర్థిక ఉత్పత్తికి 15.5 శాతం దోహదపడుతుంది. ఇది ప్రస్తుతమున్న 7.3 శాతం వాటాగా ఉంది. 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం $33 ట్రిలియన్ నుంచి $40 ట్రిలియన్ల మధ్య ఉంటుందని నరెడ్కో-నైట్ ఫ్రాంక్ నివేదిక అంచనా వేసింది.

హైదరాబాద్ లో పెట్టుబడులు

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోకి.. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల నుంచి పెట్టుబడులను కొనసాగుతాయని నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది. హైదరాబాద్‌లో ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాల నుంచి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ వర్టికల్స్ కూడా పెట్టుబడులు పెరుగుతున్నాయని నైట్ ఫ్రాంక్ సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ తెలిపారు. డేటా సెంటర్, ఇ-కామర్స్ కోసం వేర్‌హౌసింగ్, ఇతర పరిశ్రమలకు హైదరాబాద్ అనుకూలంగా మారిందన్నారు. హెచ్‌ఎన్‌ఐలు.. పెద్ద పరిమాణాల్లో, ఎత్తైన భవనాలు, మరిన్ని సౌకర్యాలు, ఖరీదైన ఇంటీరియర్‌లకు ప్రాధాన్యత ఇవ్వడంతో హైదరాబాద్‌లో హౌసింగ్ ఉన్నత స్థాయికి చేరుకుంటోందని ఆయన చెప్పారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిసర ప్రాంతాలలో భూముల ధరల పెరుగుదల కారణంగా.. బుద్వేల్, గండిపేట, కోకాపేట్ ప్రాంతాల్లో మరిన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని ఆర్థర్ తెలిపారు. 2047 నాటికి $36 ట్రిలియన్‌లకు ఆర్థిక విస్తరణకు మద్దతుగా 69 శాతం మంది శ్రామిక జనాభా ఉపాధి పొందుతారని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది.

IPL_Entry_Point