Hyderabad Real Estate : హైదరాబాద్ లో రియల్ భూమ్- గృహ, వాణిజ్య స్థలాలకు డిమాండ్
Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ రంగం పుంజుకోంటుంది. నగరంలో గృహ, వాణిజ్య స్థలాలకు డిమాండ్ పెరగడం రియల్ ఎస్టేట్ రంగానికి సానుకూలంగా మారింది. గతంతో పోలిస్తే... జూన్ నాటికి హౌస్సింగ్ ప్రాపర్టీ మార్కెట్, ఆస్తి రిజిస్ట్రేషన్లు 3 శాతం పెరిగాయని తెలుస్తోంది.
Hyderabad Real Estate : హైదరాబాద్ మహానగరంగా రూపుదిద్దుకోంటుంది. రోజురోజుకూ తన పరిధిని విస్తరించుకుంటుంది. దీంతో రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు హైదరాబాద్ హాట్‌స్పాట్‌గా మారుతోంది. డైనమిక్ ఎకానమీ, వేగవంతమైన పట్టణీకరణ, మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ దూసుకుపోతుంది. శక్తివంతమైన నగరం మారుతున్న హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశాలు పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ అభివృద్ధి చెందడానికి హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలను అనుకూలంగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లోని హౌస్సింగ్ ప్రాపర్టీ మార్కెట్.. ఆస్తి రిజిస్ట్రేషన్లలో సంవత్సరానికి 3 శాతం పెరిగిందని పేర్కొంది. జూన్ నెలలో ఆస్తుల రిజిస్ట్రేషన్ మొత్తం విలువ రూ. 2,898 కోట్లకు చేరుకుంది, గత ఏడాదితో పోలిస్తే 2% పెరుగుదలను నమోదు అయిందని తెలిపింది.
రియల్ రంగానికి సానుకూల వాతావరణం
హైదరాబాద్ ఆర్థిక వృద్ధి అంతకంతకూ పెరుగుతోంది. ఐటీ, సాంకేతిక రంగం, ఔషధ, బయోటెక్నాలజీ పరిశ్రమలకు భాగ్యనగరం కేంద్రంగా మారుతోంది. దీంతో మల్టినేషనల్ కంపెనీలు, స్టార్టప్‌లు హైదరాబాద్ కు క్యూకడుతున్నాయి. నగరంలోని ఫ్రెండ్లీ వ్యాపార వ్యవస్థ, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి వ్యాపార సంస్థలను ఆకర్షిస్తుంది. పారిశ్రామిక పార్కులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమిచ్చాయి. ఆర్థిక వృద్ధి పెరగడంతో... గృహ, వాణిజ్య స్థలాలకు పెరిగిన డిమాండ్‌తో రియల్ ఎస్టేట్ రంగాన్ని సానుకూలంగా ప్రభావితం చేసింది. ఫలితంగా హైదరాబాద్‌లోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు దీర్ఘకాలిక రాబడి కోసం చూస్తున్న వారికి లాభదాయకమైన పెట్టుబడి అవకాశాలను అందిస్తున్నాయి.
ఈ ప్రాంతాల్లో రియల్ భూమ్
హైదరాబాద్‌లోని విశేషమైన మౌలిక సదుపాయాలు, అద్భుతమైన కనెక్టివిటీ ప్రధాన రియల్ ఎస్టేట్ పెట్టుబడికి గమ్యస్థానాలుగా మారుతున్నారు. మెరుగైన రహదారి నెట్‌వర్క్‌లు, మెట్రో కనెక్టివిటీ, పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులు, నివాసితులకు అందుబాటులోకి వస్తున్నాయి. గతంలో అభివృద్ధి చెందని ప్రాంతాలను కూడా కనెక్ట్ చేస్తూ ప్రాజెక్టు వస్తుండడంతో రియల్ ఎస్టేట్ భూమ్ పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు. మారుతున్న పరిస్థితులు పెట్టుబడిదారులను, గృహ కొనుగోలుదారులను ఆకర్షిస్తాయి. వ్యాపార పార్కులు, IT హబ్‌ల స్థాపనతో పాటు రోడ్డు, మెట్రో రైలు కనెక్టివిటీ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ఆర్థిక వృద్ధికి రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను పెంచడానికి దోహదపడుతున్నాయి. ఫలితంగా హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మంచి పెట్టుబడి అవకాశాలను అందిస్తుంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి, కొండాపూర్, నల్లగండ్ల, మణికొండ, కోకాపేట్, నార్సింగి, తెల్లాపూర్ ప్రాంతాలు రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు కేంద్రంగా మారుతున్నాయి. దీంతో పాటు కేబినెట్ తాజా నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగం మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో విస్తరణతో రియల్ ఎస్టేట్ రంగంలో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.