Smita Sabharwal : కేంద్ర సర్వీసుల్లోకి స్మితా సబర్వాల్?- కొత్త ఛాలెంజ్ లకు సిద్ధమే అంటూ పోస్ట్-hyderabad news in telugu ias officer smita sabharwal may join central services ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Smita Sabharwal : కేంద్ర సర్వీసుల్లోకి స్మితా సబర్వాల్?- కొత్త ఛాలెంజ్ లకు సిద్ధమే అంటూ పోస్ట్

Smita Sabharwal : కేంద్ర సర్వీసుల్లోకి స్మితా సబర్వాల్?- కొత్త ఛాలెంజ్ లకు సిద్ధమే అంటూ పోస్ట్

Bandaru Satyaprasad HT Telugu
Dec 13, 2023 02:23 PM IST

Smita Sabharwal : బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమె ఎక్స్ లో పెట్టిన పోస్ట్ ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

స్మితా సబర్వాల్
స్మితా సబర్వాల్

Smita Sabharwal : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మర్యాద పూర్వకంగా ముఖ్య అధికారులు ముఖ్యమంత్రిని కలుస్తారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పలువురు అధికారులు మాత్రం ముఖ్యమంత్రిని కలవలేదని సమాచారం. ఈ అధికారుల్లో కొందరు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి, మాజీ సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శిగా పనిచేసిన స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కొత్త ఛాలెంజ్ లకు ఎప్పుడూ సిద్ధమే

తాజాగా స్మితా సబర్వాల్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీసు చేశానని ఆమె గుర్తు చేసుకున్నారు. కొత్త ఛాలెంజ్ లకు ఎప్పుడూ సిద్ధమే అంటూ పోస్టు పెట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ కీలక బాధ్యతలు వ్యవహరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులతో పాటు మిషన్ భగీరథ పనులను సైతం పర్యవేక్షించారు. స్మితా సబర్వాల్ సెలవు రోజుల్లో కూడా పర్యటిస్తూ తెలంగాణ టూరిజం, చేనేత వస్త్రాలను ప్రమోట్ చేసేవారు. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ గా ఉండేవారు. స్మితా సబర్వాల్ 2001లో ట్రైనీ కలెక్టర్ ఐఏఎస్ విధుల్లో చేరారు. అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచి పనీతీరులో, నలుగురికీ సాయపడుతూ ప్రత్యేక గుర్తింపును పొందారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.

రేవంత్ రెడ్డి టీమ్ లోకి ఆమ్రపాలి!

సీఎం రేవంత్ రెడ్డి టీమ్ లోకి ఒక్కొక్కరిగా అధికారులు వచ్చి చేరుతున్నారు. మొన్నటివరకు కేసీఆర్ టీమ్ లో కీలకంగా ఉన్న స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర సర్వీసులో మరో ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి రేవంత్ రెడ్డి టీమ్ లో జాయిన్ కానున్నారని చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి స్మితా సబర్వాల్ ఎక్కడా కనిపించడం లేదు. సీఎంవో పనిచేసిన ఆమె ఇప్పటి వరకూ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవలేదని తెలుస్తోంది. స్మితా సబర్వాల్ భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లో ఉండడంతో ఆమె కూడా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. స్మితా సబర్వాల్ స్థానంలో తెలంగాణ సీఎం ఆఫీసులోకి ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి జాయిన్ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే కేంద్ర సర్వీస్ నుంచి తెలంగాణకు వచ్చిన ఆమ్రపాలి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు

Whats_app_banner