Notices To Hero Navdeep : డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు నోటీసులు, ఈ నెల 23న విచారణ-hyderabad narcotic police notices to hero navdeep to attend investigation on september 23rd ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Notices To Hero Navdeep : డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు నోటీసులు, ఈ నెల 23న విచారణ

Notices To Hero Navdeep : డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు నోటీసులు, ఈ నెల 23న విచారణ

Bandaru Satyaprasad HT Telugu
Sep 21, 2023 09:49 PM IST

Notices To Hero Navdeep : మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు నార్కోటిక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

హీరో నవదీప్
హీరో నవదీప్

Notices To Hero Navdeep : మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో సెప్టెంబర్ 23న విచారణకు హాజరు కావాలని నార్కోటిక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో 41ఏ కింద నోటీసులు ఇచ్చిన పోలీసులు... విచారణకు రావాలని స్పష్టం చేశారు. ఈ నెల 23న హెచ్ న్యూ ఆఫీస్ లో విచారణకు హాజరు కావాలన్నారు. డ్రగ్స్ కేసులో నవదీప్ ఏ-37గా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తన స్నేహితుడు రామ్ చంద్ తో కలిసి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో తన పేరు బయటకు రాగానే నవదీప్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. అయితే విచారణకు సహకరించాలని హైకోర్టు నవదీప్ కు సూచించింది.

yearly horoscope entry point

నవదీప్ ఇంట్లో సోదాలు

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో హీరో నవదీప్‌ ఇంట్లో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నవదీప్‌ను 37వ నిందితుడిగా ప్రకటించారు. డ్రగ్స్‌ కేసులో అరెస్టైన నిందితుడు రాంచంద్‌ నుంచి హీరో నవదీప్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్లు నార్కోటిక్స్‌ బ్యూరో చెబుతోంది. నవదీప్‌ ఇంట్లో సోదాలు జరిగిన సమయంలో ఆయన ఇంట్లో లేనట్టు తెలుస్తోంది. మరోవైపు డ్రగ్స్‌కేసులో తనకు సంబంధం లేదంటూ తెలంగాణ హైకోర్టును నవదీప్ గతవారం ఆశ్రయించారు. దీంతో నవదీప్‌ను మంగళవారం 19వ తేదీ వరకు వరకు అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తెల్లవారు జామున నార్కోటిక్స్‌ బ్యూరో నవదీప్ నివాసంలో సోదాలు నిర్వహించింది.

నవదీప్ పిటిషన్ కొట్టివేత

మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. నవదీప్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారించింది. అయితే నవదీప్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు తమ పిటిషన్ లో కోరారు. ఈ కేసులోని నిందితులతో నవదీప్ కు సంబంధాలు ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు… 41 ఏ కింద నోటీసులు ఇచ్చి నవదీప్ ను విచారించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నవదీప్ అరెస్ట్ తప్పదా? అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ కేసులో నార్కోటిక్‌ బ్యూరో దూకుడు పెంచే పనిలో ఉంది. హైకోర్టు ఆదేశాలతో నవదీప్ కు 41ఏ నోటీసులు ఇచ్చారు పోలీసులు. నవదీప్‌తో పాటు మరికొందరికి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నెల 23న నవదీప్‌ను విచారణకు పిలిచారు. ఇప్పటికే విచారణకు సహకరించాలంటూ నవదీప్‌కు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన క్రమంలో…. నవదీప్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Whats_app_banner